Homeజాతీయ వార్తలుUnknown Armed Groups: పాక్ లోనే కాదు..అజ్ఞాత సాయుధులు భారత్ లోనూ ఉండాల్సిందే

Unknown Armed Groups: పాక్ లోనే కాదు..అజ్ఞాత సాయుధులు భారత్ లోనూ ఉండాల్సిందే

Unknown Armed Groups: పాకిస్తాన్లో అజ్ఞాత సాయుధులు ఇటీవల కాలంలో దాడులు చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే బుల్లెట్ల శబ్దాన్ని చేస్తూ.. టార్గెట్లను ఈజీగా ఫినిష్ చేస్తున్నారు. అజ్ఞాత సాయుధుల చేతిలో చనిపోయిన వారంతా కరుడుగట్టిన ఉగ్రవాదులు. లష్కరే ఏ తోయిబా, జై షే మహమ్మద్, హిజుబుల్ ముజాహిదిన్ వంటి ఉగ్రవాద గ్రూపులకు సంబంధించిన వారంతా అజ్ఞాత సాయుధుల చేతిలో చనిపోతున్నారు. ఇటీవల పాకిస్తాన్లో 10 రోజుల పండుగ నిర్వహిస్తున్నారు.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాదుల స్థావరాలు నేల […]

Unknown Armed Groups: పాకిస్తాన్లో అజ్ఞాత సాయుధులు ఇటీవల కాలంలో దాడులు చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే బుల్లెట్ల శబ్దాన్ని చేస్తూ.. టార్గెట్లను ఈజీగా ఫినిష్ చేస్తున్నారు. అజ్ఞాత సాయుధుల చేతిలో చనిపోయిన వారంతా కరుడుగట్టిన ఉగ్రవాదులు. లష్కరే ఏ తోయిబా, జై షే మహమ్మద్, హిజుబుల్ ముజాహిదిన్ వంటి ఉగ్రవాద గ్రూపులకు సంబంధించిన వారంతా అజ్ఞాత సాయుధుల చేతిలో చనిపోతున్నారు.

ఇటీవల పాకిస్తాన్లో 10 రోజుల పండుగ నిర్వహిస్తున్నారు.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాదుల స్థావరాలు నేల కూలిపోయాయి. దీంతో పాకిస్థాన్లో మర్కాయే హక్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మొత్తం ఉగ్రవాద గ్రూపుల ఆధ్వర్యంలో జరుగుతోంది. ఇటీవల బలూచిస్తాన్ రాష్ట్రంలోని క్వెట్ట ప్రాంతంలో మర్కాయే హక్ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా కమాండర్లు హఫీజ్, రైసానీ ని అజ్ఞాత సాయుధులు చంపేశారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్లో మరోసారి అజ్ఞాత సాయుధుల గురించి చర్చ నడుస్తోంది.

పాకిస్తాన్ లోనే కాకుండా భారత్ లో కూడా అజ్ఞాత సాయుధులు ఉండాలని ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇండియాలో ఉంటూ.. ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి కూడా అజ్ఞాత సాయుధులు పనిష్మెంట్ ఇవ్వాలని జాతీయవాదులు డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా మన దేశంలో కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాలు తీవ్ర హింసకు దారితీసాయి. కొన్ని మత చాందస వాద గ్రూపులు ఆ ఉద్యమాలలో పాలుపంచుకున్నాయి. అప్పట్లో కేంద్ర నిఘా వర్గాలు ప్రభుత్వానికి కీలక సమాచారాన్ని అందించాయి. దీంతో ప్రభుత్వం వారి మీద దృష్టి పెట్టింది.. అయితే ఆ తరహా వ్యక్తులకు కొన్ని రాజకీయ పార్టీలు సహకారం అందించడంతో దేశంలో అప్పుడప్పుడు శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నాయి.

అటువంటి వారికి సాయుధ అజ్ఞాత వాసులు సరైన సమాధానం చెప్పాలని.. దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటుపడాలని జాతీయవాదులు కోరుతున్నారు.. ఎందుకంటే దేశంలో అశాంతి చెలరేగితే మిగతా జనం మీద ఆ ప్రభావం పడుతుందని.. అందువల్లే అజ్ఞాత సాయుధులు మన దేశం మీద కూడా దృష్టి పెట్టాలని జాతీయవాదుల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper