ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?

టీడీపీ అధినేత చంద్రబాబుకు అన్నీ తెలుసు.. ఎక్కడా దొరక్కుండా ఎలా పాలించాలో బాగా తెలుసు అని తెలుగు తమ్ముళ్లు కథలు కథలుగా చెప్పుకుంటారు. అధికారంలో ఉన్నా పోయినా అందుకే చంద్రబాబు దొరకడు అంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఏకంగా 1638 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి నీరు పారించి రైతులకు అందించి ఆహో ఓహో అని కీర్తినందుకు చంద్రబాబు.. కనీసం ఆ ప్రాజెక్టుకు అనుమతి తీసుకోవాలన్న చిన్న విషయాన్ని పెడచెవిన పెట్టాడు. ఇప్పుడు ఫలితం చంద్రబాబుకు […]

Written By: NARESH, Updated On : July 3, 2020 5:11 pm
Follow us on


టీడీపీ అధినేత చంద్రబాబుకు అన్నీ తెలుసు.. ఎక్కడా దొరక్కుండా ఎలా పాలించాలో బాగా తెలుసు అని తెలుగు తమ్ముళ్లు కథలు కథలుగా చెప్పుకుంటారు. అధికారంలో ఉన్నా పోయినా అందుకే చంద్రబాబు దొరకడు అంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది.

ఏకంగా 1638 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి నీరు పారించి రైతులకు అందించి ఆహో ఓహో అని కీర్తినందుకు చంద్రబాబు.. కనీసం ఆ ప్రాజెక్టుకు అనుమతి తీసుకోవాలన్న చిన్న విషయాన్ని పెడచెవిన పెట్టాడు. ఇప్పుడు ఫలితం చంద్రబాబుకు రాగా.. పాపం ఇప్పటి వైసీపీ ప్రభుత్వానికి చుట్టుకుంది.

పవన్,లోకేష్ లలో పాదయాత్ర ఎవరికి వర్కౌట్ అవుతుంది?

టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన ఎంత దారుణంగా.. ప్రణాళిక లేకుండా సాగిన వైనం ఈ ఘటనతో కళ్లకు కట్టింది. టీడీపీ అధికారంలో ఉన్నపుడు నాటి సీఎం చంద్రబాబు నాయుడు, అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ రూ.1638కోట్లతో పురుషోత్తం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోని రైతులకు సాగునీరు, విశాఖ, పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ వెంట ఉండే గ్రామాలకు తాగునీరు అందించాలని ప్లాన్ చేశారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని రెండు దశల్లో నిర్మించేందుకు ముందుకొచ్చింది. 2017ఆగస్టు 15న తొలిదశను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 2017-18 ఖరీఫ్ సీజన్లో లో 1.95 టిఎంసీల నీటిని పంపింగ్ చేశారు. రెండో దశను చంద్రబాబు నాయుడు గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభించారు. పురుషోత్తపట్నం రెండు దశలకు ప్రభుత్వం 1638 కోట్లు ఖర్చు చేసింది.

అయితే బాబుగారు ఈ ప్రాజెక్టుపై క్రెడిట్ కొట్టేసి ఇప్పుడు దాన్ని జగన్ పాలనలో అడ్డుకుంటూ చేస్తున్న కుట్రలపై వైసీపీ సర్కార్ ఆగ్రహంగా ఉంది. తాజాగా ఈ పురుషోత్తమపట్నం ప్రాజెక్టుపై టిడిపీ నేత జమ్ముల చౌదరయ్య కోర్టును, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించడం అందరినీ షాక్ గురిచేస్తోంది.

చివరకు రఘురామ కృష్ణం రాజు సాధించింది ఏమిటీ?

దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ తమ ఆదేశాలు వచ్చేంతవరకు పురుషోత్తపట్నం ఎత్తిపోత నుంచి నీటిని తరలించొద్దని ఉత్తర్వులు ఇచ్చింది. సాగునీటి కోసం కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. అప్పటి వరకు నీరు తరలించుకుండా స్టే విధించడంతో రైతులకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టీడీపీ కక్ష సాధింపు రాజకీయాల వల్ల రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. టీడీపీ తీరుపట్ల స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసున్నారు.

కనీస అనుమతులు లేకుండా చంద్రబాబు, దేవినేని ఉమలు కలిసి ఈ ప్రాజెక్టు కోసం 1638కోట్లు ఖర్చు చేశారని.. ఇప్పుడు అదే టీడీపీ అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా చంద్రబాబు పరిపాలన దక్షతకు ప్రాజెక్టు అతీగతీలేకుండా నిరుపయోగంగా మారిపోయింది.