చైనా వైఖరితో భారత్ లో రాజకీయ రగడ!

చైనా వైఖరితో భారత్ లో రాజకీయ రగడ చెలరేగుతోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం వల్ల భారత భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకొచ్చారని..కానీ ప్రధాని మోడీ చోద్యం చూస్తున్నారని ఇటీవల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఐతే కాంగ్రెస్‌ కు అంతకు మించిన స్థాయిలో కౌంటర్ ఇచ్చింది బీజేపీ. సోనియా, రాహుల్‌ కు చైనా ప్రభుత్వంతో సంబంధాలున్నాయని ఏకంగా కేంద్రమంత్రులే సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మధ్యప్రదేశ్‌ మంత్రి, బీజేపీ […]

Written By: Neelambaram, Updated On : July 3, 2020 8:03 pm
Follow us on

చైనా వైఖరితో భారత్ లో రాజకీయ రగడ చెలరేగుతోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం వల్ల భారత భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకొచ్చారని..కానీ ప్రధాని మోడీ చోద్యం చూస్తున్నారని ఇటీవల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఐతే కాంగ్రెస్‌ కు అంతకు మించిన స్థాయిలో కౌంటర్ ఇచ్చింది బీజేపీ. సోనియా, రాహుల్‌ కు చైనా ప్రభుత్వంతో సంబంధాలున్నాయని ఏకంగా కేంద్రమంత్రులే సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మధ్యప్రదేశ్‌ మంత్రి, బీజేపీ నేతల కమల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాతో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కమల్ నాథ్‌ కు ఉన్న సంబంధాలను బయటపెట్టేందుకు సీబీఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రహోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

కాంగ్రెస్ అగ్ర నేతలకు చైనాతో ఉన్న ఆర్థిక సంబంధాలతో సహా అన్ని రకాల సంబంధాలపై దర్యాప్తు జరిపించాలి. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనీస్ ఎంబసీ నుంచి విరాళాలు వచ్చాయి. అందుకే అప్పట్లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి హోదాలో కమల్‌నాథ్ చైనీస్ దిగుమతులపై రిబేటు ఇచ్చారు. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ప్రజలకు చూపించేందుకు సీబీఐ దర్యాప్తు అవసరం. చైనా, యూపీయే ప్రభుత్వాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న మీడియా కథనాలను తోసిపుచ్చలేం. సోనియా గాంధీ నేతృత్వంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌ కు చైనా ఎంబసీ నుంచి కోట్లాది రూపాయలు విరాళాల రూపంలో వచ్చాయి. చైనాతో సరిహద్దు వివాదంలో కాంగ్రెస్ మెతక వైఖరికి కారణం ఇదేనా?” అని కమల్ పటేల్ ప్రశ్నించారు.