సరిహద్దుల్లో మోదీ పర్యటన.. అసలేం జరుగుతోంది?

భారత్-చైనా సరిహద్దుల్లో కొద్దిరోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 15న రాత్రి 3గంటల సమయంలో చైనా సైన్యం దొంగదెబ్బ తీయడంతో భారత జవాన్లు 21మంది వీరమరణం పొందారు. ఆ దాడి నుంచి వెంటెనే తెరుచుకున్న భారత జవాన్లు చైనా సైన్యాన్ని సరిహద్దుల్లో నుంచి రెండుకిలో మీటర్ల మేర పరిగెత్తించినట్లు సమాచారం. ఈ సంఘటనలో చైనాకు చెందిన 43మంది సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. దీనిని చైనా అధికారికంగా ప్రకటించ లేదు. ఇటీవల చైనా-భారత్ చర్చల నేపథ్యంలో చైనాకు చెందిన […]

Written By: Neelambaram, Updated On : July 3, 2020 3:29 pm
Follow us on


భారత్-చైనా సరిహద్దుల్లో కొద్దిరోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 15న రాత్రి 3గంటల సమయంలో చైనా సైన్యం దొంగదెబ్బ తీయడంతో భారత జవాన్లు 21మంది వీరమరణం పొందారు. ఆ దాడి నుంచి వెంటెనే తెరుచుకున్న భారత జవాన్లు చైనా సైన్యాన్ని సరిహద్దుల్లో నుంచి రెండుకిలో మీటర్ల మేర పరిగెత్తించినట్లు సమాచారం. ఈ సంఘటనలో చైనాకు చెందిన 43మంది సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. దీనిని చైనా అధికారికంగా ప్రకటించ లేదు. ఇటీవల చైనా-భారత్ చర్చల నేపథ్యంలో చైనాకు చెందిన ఓ కమాండర్ స్థాయి అధికారి చనిపోయినట్లు ప్రకటించింది. చైనా ప్రకటించిన తొలి మరణం ఇదే.

రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న టిక్ టాక్..?

ఈ సంఘటన జరిగి పక్షంరోజులు గడిచిన చైనా సైనికులు ఎంతమంది చనిపోయేరనేది లెక్కలు చెప్పడం లేదు. చైనా సైనికులు ఎక్కువ సంఖ్యలో మరణించడంతోనే ప్రపంచం ముందు తన పరువుపోతుందని బయటికి లెక్కలు చెప్పడం లేదని తెలుస్తోంది. భారత సైన్యం చైనాను సమర్థవంతంగా తిప్పికొట్టడంపై చాలాదేశాలు భారత్ కు మద్దతు ఇస్తున్నారు. బహిరంగంగానే అమెరికా, జపాన్, రష్యా దేశాలు అవసరమైతే తమ మద్దతు ఉంటాయని ప్రకటిస్తున్నాయి. అయితే భారత్ వీలైనంత వరకు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తోంది. అప్పటి కూడా చైనా దారికి రాకపోతే ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలని భారత్ భావిస్తోంది. ఈనేపథ్యంలో చైనా-భారత్ మధ్య మూడుసార్లు చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు సమస్య పరిష్కారం కాకుండానే అర్థాంతరంగా నిలిచిపోతున్నారు.

బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!

ఈనేపథ్యంలోనే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లఢక్ లో ఆకస్మికంగా పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్-చైనా ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మోదీ సైనికుల దుస్తుల్లో పర్యటించడం అందరినీ ఆకట్టుకుంటోంది. సీడీఎఫ్ చీఫ్ బీపీన్ రావత్ తో కలిసి లేహ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా టాప్ కమాండర్లతో సమావేశమై సరిహద్దుల్లో తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై అడిగి తెలుసుకోనున్నారు. అలాగే గాల్వానా ఘర్షణలో గాయాలపాలైన జవాన్లను ప్రధాని పరామర్శించనున్నారని తెలుస్తోంది. సైనికులకు ఆత్మస్థైర్యం కల్పించడంతోపాటు.. చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చేందుకు మోదీ లడక్ లో పర్యటించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మోదీ లేహ్ లో పర్యటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మోదీ సైనికుల దుస్తుల్లో పర్యటించడం ఆకట్టుకుంటోంది. కరోనా భయాన్నీ వీడి ఆయన సైనికులను కరచాలనం చేస్తూ వారిలో ఆత్మస్త్థైర్యాన్ని నింపుతున్నారు. సైనికులకు సెల్యూట్ చేస్తూ వారి భుజాలను తడుతూ అభినందించడం ప్రతీఒక్కరిని ఆకట్టుకుంటోంది. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ భారత ప్రధాని లఢక్ లో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది.