అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై స్పందించిన జనసేన..

ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈఎస్ఐలో 150కోట్ల అవినీతి జరిగినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ ఇటీవలే బయటిపట్టింది. ఈ కుంభకోణంలో అచ్చెనాయుడు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో శుక్రవారం ఏసీబీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో అచ్చెనాయుడిని అరెస్టుచేసి ఆయన ఇంట్లో సోదాలు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచేందుకు విజయవాడకు పోలీసులు తరలిస్తున్నారు. అచ్చెనాయుడిని అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ నేతలు ప్రభుత్వంపై […]

Written By: Neelambaram, Updated On : June 12, 2020 5:17 pm
Follow us on


ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈఎస్ఐలో 150కోట్ల అవినీతి జరిగినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ ఇటీవలే బయటిపట్టింది. ఈ కుంభకోణంలో అచ్చెనాయుడు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో శుక్రవారం ఏసీబీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో అచ్చెనాయుడిని అరెస్టుచేసి ఆయన ఇంట్లో సోదాలు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచేందుకు విజయవాడకు పోలీసులు తరలిస్తున్నారు. అచ్చెనాయుడిని అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు. తాజాగా అచ్చెనాయుడి అరెస్టుపై జనసేన పార్టీ స్పందించింది.

ఈమేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘అన్ని అక్రమాలపై దర్యాప్తు చేయాలి’ అంటూ ట్వీటర్లో ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు అవినీతికి పాల్పడినందుకా? లేదా రాజకీయ కక్ష సాధింపు కోసమా అనే విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు శ్రీ అచ్చెన్నాయుడు గారిని అరెస్టు చేయడం సందేహాలకు తావిస్తోందన్నారు.

అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం పలు సందేహాలకు తావిస్తోందని తెలిపారు. ఒక శాసనసభ్యుడిని అరెస్ట్‌ చేసే ముందు రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. అచ్చెన్నాయుడు గారి అరెస్టులో అవి లోపించినట్లు కనిపిస్తున్నాయన్నారు. ఈ.ఎస్‌.ఐ.లో జరిగిన అవకతవకలతోపాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని జనసేన డిమాండ్‌ చేస్తోందని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే టీడీపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. బీసీ నేతను కావాలనే కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. అచ్చెనాయుడిని అరెస్టు చేయడానికి ముందు ఏసీబీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. కనీసం మందులు వేసుకోనివ్వకుండా అచ్చెనాయుడిని అరెస్టు చేసి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.