Kuno National Park Cheetah Population Increase: ఆ కాంగ్రెస్ పార్టీకి ఓ విధానం అంటూ ఉండదు. ఏ విషయంలో విమర్శించాలో.. ఏ విషయంలో సపోర్ట్ చేయాలో ఇప్పటికీ తెలియదు. ఆ పార్టీ కి ఓ కుర వృద్ధుడు అధ్యక్షుడిగా ఉన్నా.. అతడికి అపారమైన అనుభవం ఉన్నా ఉపయోగం లేదు. అసలు ఏం మాట్లాడుతాడో అతడికి సోయి ఉండదు. ఇక రాహుల్ గాంధీకి ఏం మాట్లాడాలో తెలియదు. ఉన్నట్టుండి విదేశాలకు వెళ్తాడు. అక్కడేదో కూస్తాడు. ఆ తర్వాత తాపీగా ఇండియాకు వస్తాడు. తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోతాడు. ఇదిగో ఇలాంటి లోపాల వల్లే కదా బిజెపి అధికారంలోకి వస్తోంది. మోడీ ఏం చేసినా సరే చెల్లుబాటు అవుతోంది..
అప్పట్లో నరేంద్ర మోడీ తన జన్మదిన సందర్భంగా మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో ఆఫ్రికా నుంచి తెప్పించిన చీతాలను వదిలిపెట్టాడు. దీనిని కూడా రాజకీయంగా వాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకాడ లేదు. చూశారా అది మా ప్రభుత్వ కాలంలోనే ఒప్పందం కుదిరింది.. ఇప్పుడు మోడీ వదలడానికి కారణం మేమే అంటూ డబ్బాలు కొట్టుకుంది. ఇన్ని రోజులపాటు ఎందుకు తీసుకురాలేకపోయారు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోయింది. మోడీ చాకచక్యం వల్ల నమీబియా ప్రాంతం నుంచి చీతాలు వచ్చాయి.. కూనో నేషనల్ పార్క్ లో చేరాయి. కొన్ని అనారోగ్య కారణాలవల్ల కన్నుమూశాయి. దీనిపై ఆరోపణలు కూడా వచ్చాయి. నరేంద్ర మోడీ అనవసరంగా అక్కడ నుంచి తీసుకొచ్చారని విమర్శలు కూడా వినిపించాయి.
ఇప్పుడు అక్కడ చీతాలు బ్రహ్మాండంగా ఉంటున్నాయి. ఇటీవల కేజీపీ 2 అనే ఓ చీతా ప్రసవించింది. నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఈ చీతా మనదేశంలో పుట్టింది. చివరికి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పుడు కూనో నేషనల్ పార్క్ లో మొత్తం చీతాల సంఖ్య 57కు చేరుకుంది. ఇది ఒక రకంగా ఆ జాతి సంతతి వృద్ధిలో మైలురాయి అని అధికారులు చెబుతున్నారు. ఈ స్థాయిలో వృద్ధి చెందడం మామూలు విషయం కాదని చెబుతున్నారు. వాస్తవానికి రాజకీయంగా మోడీని విమర్శించవచ్చు. విధానాలపరంగా పెట్టవచ్చు. కానీ కొన్ని విషయాలలో ఏమీ అనకపోవడమే కాంగ్రెస్ పార్టీకి చాలా మంచిది. ఎందుకంటే అది చేసే నష్టం మామూలుగా ఉండదు.
