spot_img
Homeబిజినెస్55 Inch LED TV Under 50000: రూ.50 వేల లోపు 55 అంగుళాల LED...

55 Inch LED TV Under 50000: రూ.50 వేల లోపు 55 అంగుళాల LED టీవీ.. ఫ్రీ బుకింగ్ చేస్తే మరింత లాభం..

55 Inch LED TV Under 50000: ప్రస్తుతం కాలంలో బిగ్ స్క్రీన్ కలిగిన టీవీలు కొనాలని చాలా మంది చూస్తున్నారు. ఇలాంటి వారి కోసం కంపెనీలు పోటీ పడుతూ కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా c కంపెనీ నుంచి కొత్తగా S Mini Led సిరీస్ లను విడుదల చేసింది. వీటిలో 55 అంగుళాల స్క్రీన్ నుంచి 75 ఇంచెన్ డిస్ ప్లే వరకు ఉన్నాయి. ఇవి అందుబాటు ధరలోన ఉండడం విశేషం. హోం థియటర్ స్టైల్లో వీటి ద్వారా అనుభూతిని పొందవచ్చు. వీటి ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

షియోమీ కంపెనీకి చెందిన S Mini LED టీవీల్లో 55 అంగుళాల స్క్రీన్ ను కలిగిన మోడల్ ధర రూ. 51,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఆ తరువాత ఉండ 65 అంగుళాల వేరియంట్ ధర రూ. 71,999తో కొనుగోలు చేయొచ్చు. మూడో రకమైన 75 అంగుళాల వెర్షన్ ధర రూ. 99,999తో కొనుగోలు చేయొచ్చు. ఏప్రిల్ 22 నుంచి ఈ టీవీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కామర్స్ వెబ్ సైట్లతో పాటు షియోమీ రిటైల్ స్టోర్ల నుంచి వీటిని కొనుగోలు చేయొచ్చు.

వీటీలో ఏది కొనుగోలు చేసినా బ్యాంక్ ఆఫర్ వర్తిస్తుంది. 55 అంగుళాల స్క్రీన్ కు రూ.3,000 తగ్గింపు రావడంతో దీనిని రూ.48,999కే కొనుగోలు చేయొచ్చు. 65 అంగుళాల టీవీని కొనుగోలు చేస్తే రూ.5,000 వరకు తగ్గింపు వర్తిస్తుంది. అప్పుడు ఈ టీవీని రూ. 66,999కే పొందవచ్చు. ఇక 75 అంగుళాల స్క్రీన్ పై రూ.10,000 వరకు డిస్కౌంట్ రానుండడంతో దీనిని రూ.89,999కే కొనుగోలు చేయొచ్చు. వీటితో పాటు ముందే ఇవి మార్కెట్లోకి రాకముందే బుక్ చేసుకుంటే రూ. 10,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. రెండేళ్ల వారంటీతో పాటు 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ తో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.

షియోమీ నుంచి కొత్తగా మార్కెట్లోకి రాబోతున్న ఈ స్క్రీన్లు హై రిజల్యూషన్ తో వీక్షించవచ్చు. ఇవి 4 కే రిజల్యూషన్ తో పిక్చర్ అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే 60 Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది.ఈ మూడు టీవీల ప్యానెల్ 94 శాతం డీసీఐ పీ 3 కలర్ గాముట్ ను కలిగి ఉంటాయి. 510 నుంచి 1200 వరకు నిట్స్ బ్రైట్నెస్ ను అందిస్తూ ప్రకాశవంతంగా డిస్ ప్లే అవుతుంది. అలాగే ఇందులో క్లారిటీ కోసం వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 సపోర్ట్ చేస్తుంది. 34 వాట్ స్పీకర్ సెటప్ కలిగిన ఇందులో డాల్పీ ఆడియో ఉండనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular