నవ్వేటోని ముందట జారిపడ్డట్టే ఉన్నది ప్రస్తుతం హుజూరాబాద్‌లో ఓ ఎమ్మెల్యే చేసిన ఘనకార్యం. హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రచారానికొచ్చిన ఓ ఎమ్మెల్యే ఏకంగా మకాం ఏర్పాటు చేసుకుని ఓ మహిళా ప్రజాప్రతినిధిని ట్రాప్ చేసి రాసలీలు కొనసాగిస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రచారం దగ్గర పడుతుంటే ప్రజలను కలవాల్సిందిపోయి రాత్రయితే చాలు కార్యకర్తలకు దూరంగా, ఆ మహిళకు దగ్గరగా ఓ ఇంట్లో ఈ తతంగాన్నంతా నడిపిస్తున్నట్టు నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది.

అధికార, ప్రతిపక్ష పార్టీలు వారి మంత్రులను, ఎమ్మెల్యేలను ఒక్కో మండలానికి ఇన్‌చార్జులుగా నియమించాయి. గత మూడు నెలలుగా అక్కడే ఇండ్లను అద్దెకు తీసుకుని రోజూ ప్రచారం నిర్వహిస్తున్నారు. సాయంత్రం ప్రచార సరళిని సమీక్షిస్తుంటారు. ఇలానే జమ్మికుంటకు వచ్చిన ఓ ఎమ్మెల్యే స్థానిక నాయకులతో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ట్రాప్ చేసినట్టు భోగట్టా. రాష్ట్రస్థాయి పదవి ఆశజూపి ఆమెతో రాసలీలలు కొనసాగిస్తున్నారని ఇక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. రోజూ రాత్రి 8 దాటాక కార్యకర్తలకు దూరంగా ఉంటుండటం వల్ల ఈ వ్యవహారం బయటికొచ్చినట్టు కార్యకర్తలే చెబుతున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడుతున్న వేళ దృష్టి సారించాల్సిన ఇన్‌చార్జి ఎమ్మెల్యే ఇలా పరస్త్రీ వ్యామోహంతో పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరును కార్యకర్తలే అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా ఇంటిలిజెన్స్ వర్గాలకు తెలియడంతో అధిష్టానానికి సైతం ఫిర్యాదు వెళ్లినట్టు సమాచారం. దీంతో అగ్ర నేతలు ఆ ఎమ్మెల్యేపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలోనూ ఇదే తరహాలో మహిళలతో శారీరక సంబంధాలు ఏర్పరుచుకున్నట్టు కార్యకర్తలు చెబుతున్నారు.