Homeఅంతర్జాతీయంNarendra Modi Israel Visit 2026: మోదీ ఇజ్రాయెల్‌ టూర్‌.. వ్యూహాత్మక మలుపు

Narendra Modi Israel Visit 2026: మోదీ ఇజ్రాయెల్‌ టూర్‌.. వ్యూహాత్మక మలుపు

Narendra Modi Israel Visit 2026: ఫిబ్రవరి 25, 26 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌కు రెండురోజుల పర్యటన చేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ సందర్భం భారత–ఇజ్రాయెల్‌ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఈ పర్యటనను యూదు సంస్థల సదస్సులో ప్రకటించారు. మోదీ రెండు రోజులు ఇజ్రాయెల్‌లో ఉంటారు. తనకు మంచి మిత్రుడు అని చెప్పుకునే ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహుతో భేటీ కానున్నారు. మోదీ కూడా నెతన్యాహుతో ఉన్న సత్సంబంధాలను దాచుకోలేదు. వ్యవసాయ రంగంలో సహకారం. వాటర్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో కోఆపరేషన్, ఏఐలో సహకారం. సెక్యూరిటీ విషయంలో పరికరాల ఎగుమతి విషయంలో చర్చలు జరుగుతాయి.

ద్వైపాక్షిక చర్చలు
మోదీ–నెతన్యాహు భేటీలో వ్యవసాయ సహకారం, నీటి నిర్వహణ, ఏఐ, సెక్యూరిటీ పరికరాల ఎగుమతులు ప్రధానాంశాలు. ఆపరేషన్‌ సిందూర్‌లో ఇజ్రాయెల్‌ డ్రోన్‌ సాంకేతికత సహాయం అందించడం రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని తెలియజేస్తుంది. మోదీ ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో (క్నెసెట్‌) ప్రసంగం చేయనున్నారు.

హెగ్జాగాన్‌ ఆఫ్‌ అలయన్స్‌
నెతన్యాహు ప్రతిపాదించిన హెగ్జాగాన్‌ ఆఫ్‌ అలయన్స్‌ (ఆరు ముఖాల వ్యూహం)లో భారత్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్‌ కీలకం. ఒక ఆఫ్రికన్, ఒక అరబ్‌ దేశాలు చేరనున్నాయి. తుర్కీ, అజర్‌బైజాన్‌కు చెక్‌గా గ్రీస్‌–సైప్రస్‌ను చేర్చారు. ఇది భద్రతా, ఆర్థిక, రణనీతి సహకారాన్ని పెంచుతుంది.

ప్రాంతీయ సవాళ్లు
షియా రాడికల్‌ కూటమి (ఇరాన్, హమాస్, హెజ్బుల్లా, హౌతీలు) మధ్యప్రాశాంతికి ముప్పు. రాడికల్‌ సున్నీ కూటమి (సౌదీ, తుర్కీ, పాకిస్తాన్‌ అనుమానం) ఇజ్రాయెల్‌పై ప్రభావం చూపుతోంది. ఇరాన్‌ యుద్ధాలు, గల్ఫ్‌ ఉద్రిక్తతలు ఇండియా–మిడిల్‌ ఈస్ట్‌ కారిడార్‌ను ఆలస్యం చేశాయి. తాజా హెగ్జాగాన్‌ అలయన్స్‌తో భద్రత పెరుగుతుందని భావిస్తున్నారు.

ఈ పర్యటన భారత్‌ను మిడిల్‌ ఈస్ట్‌ వ్యూహాల్లో కీలక భాగస్వామిగా నిలబెడుతుంది. హెగ్జాగాన్‌ కూటమి షియా–సున్నీ ముప్పులకు బలమైన సమాధానం. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం కొత్త అవకాశాలు తెరుస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version