https://oktelugu.com/

Balakrishna: బాలయ్య అన్​స్టాపబుల్​ షోకు ఫస్ట్​ గెస్ట్​గా మోహన్​బాబు!

Balakrishna: తన స్టెప్పులతో జనాలను ఉర్రూతలూగించి డైలాగులతో ఉద్వేగం రప్పించగలిగే వన్​ అండ్​ ఓన్లీ లెజెండ్​ నందమూరి బాలకృష్ణ. ఇటీవలే ఓటీటీలో అడుగుపెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్త ఆహా ఈ షోను నిర్వహిస్తోంది. జాంబీ రెడ్డి డైరెక్టర్​ ప్రశాంత్​ వర్మ ఈ షోకు దర్శకత్వం వహిస్తున్నారు. నవంబరు 4 నుంచి ఈ ప్రోగ్రామ్ తొలి ఎపిసోడ్​​ ఆహాలో ప్రారంభం కానుంది. అయితే, ఇందులో ఫస్ట్​ గెస్ట్​ ఎవరు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 26, 2021 / 02:42 PM IST
    Follow us on

    Balakrishna: తన స్టెప్పులతో జనాలను ఉర్రూతలూగించి డైలాగులతో ఉద్వేగం రప్పించగలిగే వన్​ అండ్​ ఓన్లీ లెజెండ్​ నందమూరి బాలకృష్ణ. ఇటీవలే ఓటీటీలో అడుగుపెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్త ఆహా ఈ షోను నిర్వహిస్తోంది. జాంబీ రెడ్డి డైరెక్టర్​ ప్రశాంత్​ వర్మ ఈ షోకు దర్శకత్వం వహిస్తున్నారు. నవంబరు 4 నుంచి ఈ ప్రోగ్రామ్ తొలి ఎపిసోడ్​​ ఆహాలో ప్రారంభం కానుంది. అయితే, ఇందులో ఫస్ట్​ గెస్ట్​ ఎవరు వస్తారనేదాపై అనేక గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్​ చిరంజీవి హాజరు అవుతారనే వార్తలూ వచ్చాయి. అయితే, ఈ షో ఫస్ట్​ గెస్ట్​గా మంచు మోహన్​బాబు ఫ్యామిలీ హాజరయినట్లు తెలుస్తోంది. మోహన్​బాబును ఇంటర్వ్యూ చేసిన తర్వాత సెట్​లో వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి.

    తొలి ఎపిసోడ్​ చాలా సరదాగా నడిచిందని బాలయ్య సెట్​లో ఎంతో ఫన్​ చేశారని సమాచారం. గతంలో మంచు ఫ్యామిలీతో బాలయ్యకు విభేదాలున్నాయని టాక్​. ఒకానొక సమయంలో బాలకృష్ణ అల్లుడు ఓడిపోవడానికి తానే హెల్ప్ చేశానని మోహన్ బాబు మీడియా ముందు వెల్లడించారు. అయితే, ఈ విషయాలపై ఇంటర్వ్యూలో ప్రస్థావించారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు ఎప్పుడూ ఉగ్రరూపంతో కనిపించే బాలయ్య.. ఈ షోకు హోస్ట్​గా చేస్తుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్​ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఇటీవలే విడుదలైన టీజర్​లో బాలయ్య పాత్రపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి.