KTR Uncle Passed Away : సీఎం కేసీఆర్ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు కన్నుమూశారు. అనారోగ్యంతో ఈ నెల 27న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన హరినాథరావు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు.
హరినాథరావు పార్థీవదేహాన్ని రాయదుర్గంలోని వారి నివాసానికి తరలించారు. కేటీఆర్-శైలిమ దంపతులు, కుటుంబ సభ్యులు వారి వెంట ఉన్నారు. శైలిమ తండ్రి హరినాథరావు మరణాన్ని తట్టుకోలేక కన్నీళ్ల పర్యంతం అయ్యింది. మామ మరణంతో కేటీఆర్ అక్కడే ఉండి కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నారు.
హరినాథరావు భౌతికకాయానికి సీఎం కేసీఆర్ దంపతులు, ఎమ్మెల్సీ కవిత, మంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ నివాళులర్పించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకుడు, మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ మామ హరినాధ్ రావు గారి మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.
KCR: తన వియ్యంకుడు (మంత్రి కేటీఆర్ మామ) పాకాల హరినాథరావు భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో హరినాథరావు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. దీంతో పార్థివదేహాన్ని రాయదుర్గంలోని వారి నివాసానికి తరలించారు. #CMKCR #KTR #Hyderabad pic.twitter.com/cpZlweBZcJ
— Eenadu (@eenadulivenews) December 29, 2022
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Minister ktr uncle pakala harinatha rao passed away
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com