Homeజాతీయ వార్తలుPriyanka Bishnoy: ఆర్ఏఎస్ అధికారి ప్రియాంక బిష్ణోయ్ కన్నుమూత.. కారణం అదేనా..? విచారణకు ఆదేశించిన కలెక్టర్..

Priyanka Bishnoy: ఆర్ఏఎస్ అధికారి ప్రియాంక బిష్ణోయ్ కన్నుమూత.. కారణం అదేనా..? విచారణకు ఆదేశించిన కలెక్టర్..

Priyanka Bishnoy: జోధ్‌పూర్ అసిస్టెంట్ కలెక్టర్ ప్రియాంక బిష్ణోయ్ చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ప్రియాంక చికిత్స విషయంలో వైద్యుల నిర్లక్ష్యం ఉందని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆర్ఏఎస్ అధికారి ప్రియాంక బిష్ణోయ్ బుధవారం రాత్రి అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. జోధ్ పూర్ లో అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేస్తున్న ఆమె ఇటీవల సెప్టెంబర్ 1న మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ గా బదిలీ అయ్యారు. సెప్టెంబర్ 5న శస్త్రచికిత్స కోసం నగరంలోని వసుంధర హాస్పిటల్ లో చేరారు. శస్త్రచికిత్స తర్వాత తలెత్తిన సమస్యల కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. సెప్టెంబర్ 7న ఆమెను అహ్మదాబాద్ కు తరలించారు. అక్కడ బుధవారం రాత్రి మృతి చెందింది. ప్రియాంక బిష్ణోయ్ మరణంపై బిష్ణోయ్ కమ్యూనిటీతో సహా ప్రజలందరూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. ప్రియాంకా బిష్ణోయ్ మృతిపై సీఎం భజన్ లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రియాంక బిష్ణోయ్ ఎవరు?
ప్రియాంక బిష్ణోయ్ సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. 2016లో ఆర్ఏఎస్ కు ఎంపికైంది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఈమె అధికారిగా ఉద్యోగం సాధించి మంచి మంచి పనులు చేపడుతూ తక్కువ సమయంలోనే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రియాంక బిష్ణోయ్ కు సన్మానం కూడా చేశారు.

ప్రియాంక మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని బిష్ణోయ్ మహాసభ అధ్యక్షుడు దేవేంద్ర బిష్ణోయ్ డిమాండ్ చేశారు. 2016 బ్యాచ్ కు చెందిన ప్రియాంక విష్ణోయ్ బికనీర్ లోని నోఖా నివాసి. ఆమె తండ్రి న్యాయవాది. ఫలోడీ జిల్లా సూర్పురాకు చెందిన ఎక్సైజ్ అధికారి విక్రమ్ బిష్ణోయ్ తో ఆమెకు వివాహం జరిగింది. మామ సాహిరామ్ బిష్ణోయ్ పోలీస్ అధికారి. ఈ రోజు (గురువారం-సెప్టెంబర్ 19) ప్రియాంక అంత్యక్రియలు జరగనున్నాయి.

చికిత్సలో నిర్లక్ష్యం జరిగిందా..?
తీవ్రమైన కడుపు నొప్పితో జోధ్‌పూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. గర్భసంచిలో సమస్యలు ఉన్నాయని ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అక్కడ శస్త్రచికిత్స నిర్వహించారు. కానీ ఆ తర్వాత ఆమె మరణించినట్లు ధృవీకరించారు. చికిత్సలో నిర్లక్ష్యం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రియాంక మామ సాహిరామ్ బిష్ణోయ్ కలెక్టర్ కు లేఖ ద్వారా విన్నవించారు. స్పందించిన కలెక్టర్ పూర్తి విచారణ జరపాలని మెడికల్ కాలేజీని కలెక్టర్ ఆదేశించారు. విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ భారతి సారస్వత్ తెలిపారు.

మూడు రోజుల్లో విచారణ అనంతరం నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఆర్ఏఎస్ అధికారి ప్రియాంక బిష్ణోయ్ చికిత్స పొందుతూ జోధ్ పూర్ లోని ఓ ప్రైవేట్ హస్పిటల్ లో చేరారు. ఆ తర్వాత ప్రియాంక బిష్ణోయ్ ను కుటుంబ సభ్యులు అహ్మదాబాద్ తీసుకెళ్లారు. ఇక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. జోధ్ పూర్ లో చికిత్స సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. దీంతో జోధ్ పూర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ పై విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు.

ఆసుపత్రి వైద్యులు ఏం చెప్పారంటే?
కాగా వసుంధర హాస్పిటల్ కు చెందిన డా. సంజయ్ మక్వానా మాట్లాడుతూ శస్త్ర చికిత్సలో ఎలాంటి తప్పు జరగలేదన్నారు. ఆమె పుట్టినప్పటి నుంచి మెదడులో AV లోపం ఉంది. చిన్న వయస్సులో ఎప్పుడైనా లీక్ కావచ్చు. దురదృష్టవశాత్తు ఆపరేషన్ నుంచి కోలుకున్న 24 గంటల తర్వాత లీక్ జరిగింది. ఆ రోజు ఒత్తిడి కారణంగా లక్షణాలు బయటకు కనిపించాయి. సీటీ స్కాన్‌లోనూ ఇదే విషయం వెల్లడైంది అని వివరించారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular