Samantha: సమంత అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. తాను పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా ఇతరుల కోసం దేవుడిని ప్రార్ధించారు. సమంత గొప్ప మనసును నెటిజెన్స్ ప్రశంసిస్తున్నారు. సమంత జీవితంలో కఠిన సమయం ఇది. ఆమె ప్రాణాంతక మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్నారు. యశోద చిత్ర విడుదలకు ముందు సమంత మయోసైటిస్ బారిన పడ్డట్లు తెలియజేశారు. సమంత ప్రకటన అందరినీ కలచివేసింది. చిత్ర ప్రముఖులు సోషల్ మీడియాలో వేదికగా ఆమె తిరిగి కోలుకోవాలని కాంక్షించారు. చిరంజీవి, ఎన్టీఆర్ తో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు సమంత ఆరోగ్యం మీద స్పందించారు.

ఇక మీడియా కథనాలు మరింత భయపెట్టాయి. యశోద చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన సమంత తన ఆరోగ్య పరిస్థితిపై కొంత స్పష్టత ఇచ్చారు. మీడియా కథనాల్లో చెప్పినట్లు నేనేమి చనిపోవడం లేదు. బ్రతికే ఉన్నాను. మయోసైటిస్ ప్రాణాంతకం ఏమీ కాదు. అలా అని చిన్న సమస్య కూడా కాదు. నేను పోరాడాల్సి ఉంది. ఈ మహమ్మారి నుండి బయట పడతానని నాకు నమ్మకం ఉంది, అంటూ సమంత ఎమోషనల్ అయ్యారు.
సమంత మెరుగైన వైద్యం కోసం పలు దేశాలకు వెళుతున్నట్లు సమాచారం. ఇటీవల ఆమె దక్షిణ కొరియా వెళ్లారంటూ ప్రచారం జరిగింది. ఇక సమంత కోలుకుని షూటింగ్స్ లో పాల్గొనడానికి సమయం పట్టేలా ఉంది. దీంతో సమంత సైన్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ నుండి తప్పుకున్నారని వినికిడి. ముఖ్యంగా ఆమె బాలీవుడ్ చిత్రాలను క్యాన్సిల్ చేశారట. విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషి మాత్రమే ఆమె పూర్తి చేయాల్సి ఉంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఈ మూవీ విడుదల కానుంది.

సమంతలో ఒకప్పటి చురుకుతనం, ఎనర్జీ లేదు. ఆమె అరుదుగా సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతున్నారు. అంతటి బాధలో కూడా అభిమానుల కోసం న్యూ ఇయర్ విషెస్ సమంత షేర్ చేశారు. ”బాధ్యతలు ముందుకు తీసుకెళ్లాలి. నియంత్రించగలిగే విషయాలు నియంత్రిద్దాం. కొత్త లక్ష్యాలు, తీర్మానాలు చేద్దాం. మన కోరికలు నెరవేరడంలో ఆ దేవుని దయ మనకు ఉంటుంది. హ్యాపీ న్యూఇయర్” అని సమంత సందేశం పంచుకున్నారు. సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ తిరిగి ఆమెకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఆమె పూర్తిగా కోలుకొని మునుపటిలా వరుస చిత్రాలు చేయాలని కోరుకుంటున్నారు.
View this post on Instagram