Major Mohit Sharma: అయితే ప్రస్తుతం ఉగ్రవాద దేశంతో మనకు ఒక రకమైన యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ వ్యవహారంలో భారత్ పై చేయి ప్రదర్శిస్తోంది. ఉగ్రవాద దేశానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. మనదేశంలో భారీగా నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నది. మిస్సైల్స్.. ఇతర ఆయుధ సామాగ్రి తో ఉగ్రవాద దేశం చేస్తున్న చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. దీంతో మనదేశంలో పెద్దగా నష్టం వాటిల్లడం లేదు. మనదేశంలో ఎంతో విలువైన విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాల వద్ద భారత సైన్యం ఎప్పటికప్పుడు పహారా కాస్తోంది. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతోంది.
Also Read: పాక్ శక్తివంతమైనదా: ట్రంప్ కు ఏమైనా మతి పోయిందా?
పోకిరి సినిమా చూపించాడు
సాధారణంగా శత్రుదేశంతో తలపడాలి అంటే మన దేశ సైనికులు ఎంతో ధైర్యసాహసాలకు పాల్పడాలి.. ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉండదు. శత్రువులతో తలపడుతున్నప్పుడు మన సోల్జర్స్ ఏమాత్రం వెనుకంజ వేయరు. చివరికి ప్రాణాలను సైతం లెక్కచేయరు. అలాంటి ఓ సోల్జర్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో ఉగ్రవాదవేషంతో మనకు యుద్ధం మొదలైనప్పుడు మేజర్ మోహిత్ శర్మ తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు. ఏకంగా టెర్రరిస్టుల క్యాంపులు తెలుసుకోవడానికి 2004లో అతడు పాకిస్తాన్ వెళ్లిపోయాడు. ఇండియన్ ఆర్మీ పై విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసేవాడు. ఇదే క్రమంలో ఇండియన్ ఆర్మీపై పగతో రగిలిపోతున్న వ్యక్తిగా నటించేవాడు. ఇండియన్ ఆర్మీ పై కచ్చితంగా పగ తీర్చుకోవాలని పదేపదే అంటూ ఉండేవాడు. దీంతో అతడిని నమ్మిన ఉగ్రవాదులు ఒక గ్రూపులో చేర్చారు. రెండు వారాలపాటు అతడు అక్కడే ఉన్నాడు. ఉగ్రవాదుల సమాచారం మొత్తం తెలుసుకున్నాడు. తర్వాత వారి శరీరంలోకి తన బుల్లెట్లను దించేశాడు. తద్వారా తన మాస్టర్ బ్రెయిన్ తో ఉగ్రవాదుల పీచాన్ని అణచివేశాడు. అంతేకాదు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా దాని సిద్ధమని నిరూపించాడు. అయితే 2009 ఆపరేషన్ కుప్వారా లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో మోహిత్ శర్మ చనిపోయాడు. అయినప్పటికీ అతడి సేవలను ఇప్పటికీ సైనికులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. గొప్ప వీరుడని కోల్పోయామని వ్యాఖ్యానిస్తూనే ఉంటారు. భారత సైన్యంలో తెర వెనుక ఆపరేషన్లు ఎన్నో జరుగుతున్నప్పటికీ.. మోహిత్ శర్మ చేసిన ఆపరేషన్ మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎందుకంటే శత్రుదేశానికి అప్పట్లోనే అతడు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఉగ్రవాద గ్రూపులో చేరి.. ఉగ్రవాదులను చంపి అవతల పడేశాడు.