PAN Card : ఆధార్ కార్డు లాగే, పాన్ కార్డు కూడా నేడు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. ఇది చాలా విషయాలలో అవసరం అవుతుంది. అందరికీ అప్లే చేసుకోవడం తెలియక కొందరు దీని గురించి చాలా కష్టపడతారు. కొన్ని సార్లు ఈ పాన్ కార్డ్ చాలా ముఖ్యమైన విషయాలలో కూడా అవసరం అవుతుంది. అయితే ముఖ్యంగా పాన్ కార్డ్ లేకుండా మీరు ఏ ముఖ్యమైన పనిని పూర్తి చేయలేరు. ఆదాయం లేదా డబ్బుకు సంబంధించిన ఏదైనా పనికి పాన్ కార్డ్ కచ్చితంగా అవసరం అవుతుంది. అయితే మీరు మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా పాన్ కార్డ్ అప్లే చేయాలి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మనం ఓ ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం.
మైనర్ పిల్లల కోసం ఆధార్ కార్డు తయారు చేసినట్లే, మీరు కూడా అదే పద్ధతిలో పాన్ కార్డును తయారు చేయవచ్చు. దీని కోసం మీరు ఏ కార్యాలయానికి కూడా వెళ్లవలసిన అవసరం లేదు. మీరు మీ ఇంటి నుంచే మీ బిడ్డ కోసం పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు మీ పిల్లల పేరు మీద స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తే, మీకు పాన్ కార్డ్ అవసరం అవుతుంది. పిల్లవాడు పెద్దవాడైనప్పుడు లేదా 18 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త పాన్ కార్డులోని ఫోటో, సంతకం కొత్తవి వస్తాయి అంతే. కానీ వారి పాన్ నంబర్ అలాగే ఉంటుంది.
Also Read : ‘పాన్ కార్డ్ హోల్డర్లకు కొత్త గడువు.. ఆధార్ లింక్ చేయాల్సిందే!
ఏ పత్రాలు అవసరం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు, అవసరమైన అన్ని పత్రాలను మీ వద్ద ఉంచుకోవడం ముఖ్యం. వీటిలో గుర్తింపు కార్డు, ఓటరు ఐడి, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ ఉన్నాయి. ఇది కాకుండా, మీరు పిల్లల జనన ధృవీకరణ పత్రాన్ని కూడా అందించాల్సి రావచ్చు. అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ వంటివి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి
పాన్ కార్డ్ పొందడానికి, ముందుగా మీరు NSDL వెబ్‌సైట్‌కి వెళ్లాలి. దీని తర్వాత, కొత్త పాన్‌కి వెళ్లి, ఇండియన్ సిటిజన్, వ్యక్తిగత విభాగాన్ని ఎంచుకోండి. తరువాత పిల్లల ప్రాథమిక సమాచారం, మీ సమాచారాన్ని నమోదు చేయండి.
దీని తరువాత, అవసరమైన పత్రాన్ని స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో సమర్పించండి. తరువాత మీరు అవసరమైన రుసుము చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి. ధృవీకరణ తర్వాత మీకు పాన్ కార్డ్ లభిస్తుంది. మీరు ఈ పాన్ కార్డును భౌతికంగా, ఆన్‌లైన్ రూపంలో పొందవచ్చు. మీరు పిల్లల సంబంధిత పథకాలలో పెట్టుబడి పెట్టేటప్పుడు దీన్ని ఉపయోగించవచ్చు. మీ ప్రాంతంలో విద్యుత్ లేదా ఇంటర్నెట్ కొరత ఉంటే సమీపంలోని ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి కూడా పాన్ కార్డు పొందవచ్చు.