Balayya and NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. స్వర్గీయ శ్రీ ‘నందమూరి తారక రామారావు’ గారు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా గొప్ప క్రేజ్ ను అయితే సంపాదించి పెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన సీఎంగా పదవి బాధ్యతలను కొనసాగించి తెలుగు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ఒకప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని సైతం తట్టుకొని తను సినిమాలను చేస్తూ గొప్ప విజయాలను సాధిస్తూ తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నాడు. మరి అలాంటి నట శిఖరం ఫ్యామిలీ నుంచి వచ్చిన మరికొంతమంది హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఇక తన తర్వాత నందమూరి బాలకృష్ణ భారీ విజయాలను సాధిస్తూ మంచి సినిమాలు చేస్తూ ఆయనకంటూ సపరేటు ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే నందమూరి ఫ్యామిలీ మూడోవ జనరేషన్ హీరోగా ముందుకు సాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య బాబుల మధ్య కొంతవరకు విభేదాలు అయితే ఉన్నాయి. మరి ఈ విభేదాలకు చెక్ పెడుతూ బాలయ్య బాబు (Balayya Babu) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) క్యామియో రోల్ పోషించబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
Also Read : కథ ఎన్టీఆర్ కి నచ్చింది, బాలయ్యకు నచ్చలేదు… కట్ చేస్తే రిజల్ట్ చూసి అందరూ షాక్!
ప్రస్తుతం బాలయ్య బోయపాటి డైరెక్షన్లో అఖండ 2 (Akhanda 2) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో క్యామియో ఇప్పించాలనే ఉద్దేశ్యంలో హరీష్ శంకర్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
అయితే హరీష్ శంకర్ ఇంతకుముందు చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించలేదు. ఇక పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Usthad Bhagath Sing) సినిమా సెట్స్ మీదనే ఉంది అయినప్పటికి ఆయన బాలయ్య బాబుతో ఒక సినిమాని చేయబోతున్నడంటు వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ సినిమాతో కనక ఆయన సూపర్ సక్సెస్ ని సాధిస్తే తనకంటూ ఒక భారీ ఇమేజ్ కూడా ఏర్పడుతుంది అనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : బాలయ్య రెండు సార్లు థియేటర్ లో చూసిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా అదేనా..? ఇన్ని రోజులు తెలియలేదుగా!