https://oktelugu.com/

‘మద్యం’పై ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదం..!

మద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధానం చెప్పేదొకటి.. చేసేదొకటి అన్న చందంగా ఉంది. ఇటీవల మధ్యం ధరలను రెండు పర్యాయాలుగా భారీ మొత్తంలో పెంచింది. ఆ సమయంలో మద్యం వినియోగాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ పెద్దలు వెళ్లడించారు. ప్రస్తుతం మద్యం విక్రయాల సమయం పెంపూ… మద్యం వినియోగం తగ్గించడానికేనా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం వైన్ షాపులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే నిర్వహించాల్సి ఉంది. ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 26, 2020 3:20 pm
    Follow us on


    మద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధానం చెప్పేదొకటి.. చేసేదొకటి అన్న చందంగా ఉంది. ఇటీవల మధ్యం ధరలను రెండు పర్యాయాలుగా భారీ మొత్తంలో పెంచింది. ఆ సమయంలో మద్యం వినియోగాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ పెద్దలు వెళ్లడించారు. ప్రస్తుతం మద్యం విక్రయాల సమయం పెంపూ… మద్యం వినియోగం తగ్గించడానికేనా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం వైన్ షాపులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే నిర్వహించాల్సి ఉంది. ఈ సమయాన్ని మరో గంట పాటు పొడిగించి 9 గంటల వరకూ కొనసాగించేందుకు స్పెషల్ సీఎస్ రజిత్ భార్గవ ఉత్తర్వులు ఇచ్చారు.

    Also Read: జగన్ ను ఇరుకున పెడుతున్న వైసీపీ ఎంపీ?

    సాధారణంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ మద్యం వినియోగం అధికంగా ఉంటుంది. మధ్యం సేవించే అటవాటు ఉన్న పేద, మధ్యతరగతి వినియోగదారులు ఈ సమయంలోనే అధికంగా సేవిస్తుంటారు. మధ్యం షాపులను 8 గంటలకు మూసి వేయడం మద్యం విక్రయాలు తగ్గాయని ఆ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారంలోనే మద్యం షాపుల మూసివేత సమయాన్ని మరో గంట పాటు పోడిగించారనే వాధనలు వినిపిస్తున్నాయి. అయితే స్పెషల్ సిఎస్ మాత్రం ఉత్తర్వులలో షాపులలో పని చేస్తున్న సిబ్బంది ఏ రోజు అమ్మకాలు ఆరోజు రిజిస్టర్ చేసేందుకు, ఇతర అవసరాల కోసం షాపులు తెరిచి ఉంచే సమయాన్ని మరో గంటల పోడిగించినట్లు పేర్కొనడం విశేషం.

    మద్యం షాపుల తెరిచి ఉంచే సమయాన్ని మరో గంటల పాటు పోడిగించడంపై టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. ఈ అంశంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. వినియోగాన్ని తగ్గించేందుకే మద్యం ధరలు పెంచామని బిల్డప్ ఇచ్చిన అధికార పార్టీ నాయకులు, ఇప్పడు సమయాన్ని ఎందుకు పెంచారనే అంశంపై సమాధానం ఇవ్వాలన్నారు. జె టాక్స్ లక్ష్యాలను చేరుకోకపోవడంతో సమయాన్ని పెంచారని ట్వీట్ చేశారు.

    Also Read: మీడియాకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?

    మరోవైపు ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచడంతో రాష్ట్రంలో నాటు సారా తయారీ ఊపందుకుంది. అన్ని జిల్లాల్లో సారా తయారీని గుట్టు చప్పడు కాకుండా రహస్య ప్రాంతాల్లో చేపడుతున్నారు. అధికారులు దాడులు నిర్వహించిన కొన్ని చోట్ల సారా తయారీ చేసే ముడి సరుకును ధ్వంసం చేస్తున్నప్పటికీ సారా తయారీని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు.