చిక్కుల్లో మాజీ ఎంపీ రాయపాటి..!

ప్రముఖ్య నిర్మాణ సంస్థ ట్రాన్స్ ట్రాయ్ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించకపోవడంతో ఆ సంస్థ డైరెక్టర్లు చిక్కుల్లో పడ్డారు. సంస్థ మాజీ ఎండీ శ్రీధర్ చెరుకూరి, మాజీ అడిషినల్ డైరెక్టర్ రాయపాటి సాంబశివరావు సహా మరో ఐదుగురు డైరెక్టర్ లకు సెంట్రల్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. సెంట్రల్ బ్యాంక్ కు ట్రాన్స్ ట్రాయ్ సంస్థ 2017 జనవరి 9వ తేదీ నాటికి 452.41 కోట్లు చెల్లించాల్సి ఉందని బ్యాంక్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. రుణం […]

Written By: Neelambaram, Updated On : July 26, 2020 12:15 pm
Follow us on


ప్రముఖ్య నిర్మాణ సంస్థ ట్రాన్స్ ట్రాయ్ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించకపోవడంతో ఆ సంస్థ డైరెక్టర్లు చిక్కుల్లో పడ్డారు. సంస్థ మాజీ ఎండీ శ్రీధర్ చెరుకూరి, మాజీ అడిషినల్ డైరెక్టర్ రాయపాటి సాంబశివరావు సహా మరో ఐదుగురు డైరెక్టర్ లకు సెంట్రల్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. సెంట్రల్ బ్యాంక్ కు ట్రాన్స్ ట్రాయ్ సంస్థ 2017 జనవరి 9వ తేదీ నాటికి 452.41 కోట్లు చెల్లించాల్సి ఉందని బ్యాంక్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. రుణం చెల్లించకపోవడంతో తనఖా ఆస్తులను వేలం వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకు ఆగస్టు 18వ తేదీ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు బిడ్స్ దాఖలు చేసేందుకు ఆగస్టు 14వ తేదీ వరకూ బ్యాంక్ గడువు ఇచ్చింది.

Also Read: మంగళగిరి ఎమ్మెల్యే సైలెంట్ అయ్యాడెందుకు?

ఇప్పటికే ఈ సంస్థ కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ నుంచి కేసులు ఎదుర్కొంటుంది. ఏపీ, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల్లో కెనరా బ్యాంక్ ను రూ.300 కోట్ల మేర మోసం చేసిన విషయంలో సంస్థ డైరెక్టర్ లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇటీవల సీబీఐ అధికారులు గుంటూరులోని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, కీలక పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తాము రెండేళ్ల కిందటే ట్రాన్స్ ట్రాయ్ నుంచి బయటకు వచ్చినట్లు రాయపాటి కుటుంబ సభ్యులు సీబీఐ అధికారులకు వెల్లడించారు. అయినప్పటికీ బ్యాంకు అప్పులకు హామీదారుగా ఉండటంతో రాయపాటి సాంబశివరావు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

2001లో ఏర్పాటైన ఈ సంస్థ 2003 నుంచి వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రుణ సంస్థల నుంచి రూ.3,694 కోట్ల మేర రుణాలను పొందింది. కొన్ని బ్యాంకుల నుంచి పొందిన రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. సంస్థకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల జాబితాలో ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోరా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, విజయా బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, శ్రీ ఎక్యూప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్, బిఎండబ్ల్యూ ఇండియా ఫైనాన్స్ సర్వీసు లిమిటెడ్ వంటి సంస్థలు ఉన్నాయి.

Also Read: ఆ రాష్ట్రానికి కరోనా తలవంచనుందా?

తమ వద్ద తీసుకున్న రుణాలను ఇతర ఖాతాలకు మళ్లించారని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాదు ప్రాంతీయ విభాగాధిపతి ఎస్.కె భార్గవ ఇచ్చిన ఫిర్యాదుపైన సీబీఐ విచారణ చేపట్టింది. దీంతో సీబీఐ జాతీయ బ్యాంక్ ల రుణాల ఎగవేతకు సంబంధించి 120 (బి), రెడ్ విత్ 420, ఛీటింగ్, 477 (ఎ) సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా కొనసాగిన సమయంలో రాయపాటి సాంబశివరావు తనకు ఉన్న పలుకుబడితో ఉమ్మడి ఆంధ్రపదేశ్ తోపాటు ఇతర రాష్ట్రాల్లోను పలు కాంట్రాక్టులను ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు ఇప్పించారు. రాయపాటి టీడీపీలో చేరిన అనంతరం టిడిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ సంస్థకు కట్టబెట్టింది. మూడేళ్లపాటు పోలవరం పనులను ట్రాన్స్ ట్రాయ్ చేపట్టింది. ఈ క్రమంలో పోలవరం నిర్మాణ పనుల్లో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకుందని వైసీపీ ప్రభుత్వం చెప్పింది.