విజయసాయిరెడ్డికి గంటా షాక్ ఇవ్వనున్నాడా?

టీడీపీ పార్టీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన గంటా శ్రీనివాసరావు రెండు దశాబ్దాలలో మూడు రాజకీయ పార్టీలతో చేతులు కలిపారు. 2004 లో చోడవరం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి గంటా, బాబుని కాదని 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా చేశారు. 2014 లో మారలా తిరిగి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికలలో భీమిలి […]

Written By: Neelambaram, Updated On : July 26, 2020 5:04 pm
Follow us on


టీడీపీ పార్టీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన గంటా శ్రీనివాసరావు రెండు దశాబ్దాలలో మూడు రాజకీయ పార్టీలతో చేతులు కలిపారు. 2004 లో చోడవరం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి గంటా, బాబుని కాదని 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా చేశారు. 2014 లో మారలా తిరిగి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికలలో భీమిలి నియోజక వర్గం నుండి గెలిచిన గంటా…మంత్రి పదవి కూడా దక్కించుకున్నాడు. ఏళ్లుగా పార్టీలు మారడం అలవాటైన గంటా, అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు చేస్తారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా అనేక భూదందాలు, మరియు స్కామ్స్ కి పాల్పడ్డారని ఆయనపై ఉన్న ఆరోపణలు. సొంత పార్టీ నేతలతోనే అప్పట్లో ఆయనకు విభేదాలు కలవు.

Also Read: చిక్కుల్లో మాజీ ఎంపీ రాయపాటి..!

వైసీపీ ప్రభుత్వం వచ్చాక గంటా అరెస్ట్ పై అనేక కథనాలు రావడం జరిగింది. స్కూల్ పిల్లలసైకిళ్ళ పంపిణీ పథకంలో గంటా అవినీతికి పాల్పడ్డారని, ఆయన అరెస్టుకు రంగం సిద్ధం అవుతుందని వార్తలు రావడం జరిగింది. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి పరోక్షంగా గంటా అరెస్ట్ తప్పదంటూ వేసిన ట్వీట్స్ సంచలనంగా మారాయి. దీనితో వైసీపీలో చేరడానికి గంటా పావులు కదుపుతున్నారని కొన్నాళ్లుగా వరుస కథనాలు రావడం జరిగింది. ఐతే గంటా వైసీపీ ఎంట్రీకి సర్వం సిద్ధం అని తెలుస్తుంది. దీనిపై జగన్ తో చర్చలు జరగడం, ఆయన ఒకే చెప్పడం కూడా జరిగిపోయిందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.

Also Read: ఏపీ పోలీస్ పై ఎంపీ రఘురామ గురి..!

విజయసాయిరెడ్డికి కరోనా వైరస్ సోకడం వలన, ఆయన కొరెంటైన్ లో ఉంటూ రాజకీయాలకు స్వల్ప విరామం ప్రకటించారు. విజయసాయిరెడ్డి రిలాక్స్ అవడంతో గంటాకు ఎంట్రీ సులభం అయ్యింది అంటున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మరియు విజయ సాయి రెడ్డి గంటా శ్రీనివాస్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . ముఖ్యంగా అవంతి శ్రీనివాస్, గంటా చేరికతో విశాఖలో తన అధిపత్యానికి గండిపడే అవకాశం కలదని భావిస్తున్నారు. వీరిద్దరికి ఇష్టం లేకపోవడం వలనే గంటా శ్రీనివాస్ వైసీపీలోకి రావడం కష్టం అవుతుందట. మరి గంటా వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం లాంఛనమే అని తెలుస్తుండగా, దీనిపై కొద్దిరోజులలో అధికారిక ప్రకటన రానుందట. విజయసాయిరెడ్డి విరామం గంటా ఎంట్రీని సులభం చేసిందనేది అక్కడ టాక్.