Lionel Messi Visit Vantara: ఈ ప్రపంచాన్ని శాసించేది కేవలం డబ్బు మాత్రమే. డబ్బుంటే చాలు ఏదైనా చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు. ఎక్కడిదాకైనా వెళ్లొచ్చు అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. అందువల్లే డబ్బు ప్రపంచాన్ని మార్చేస్తుంది. ప్రపంచ గతిని తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. డబ్బున్న వాళ్ళే ఈ ప్రపంచాన్ని ఏలుతున్నారు. అధికారాన్ని దక్కించుకొని సర్వ శక్తివంతులుగా వెలుగొందుతున్నారు. డబ్బున్న వాళ్ళు మిగతా వారిని ఆడిస్తున్నారు. తమ డబ్బు బలంతో శాసిస్తున్నారు. ఇలా డబ్బు కోసం ఆడే వారిలో చాలామంది ఉంటారు. అందులో అర్జెంటీనా ఫుట్ బాల్ ఆటగాడు మెస్సి కూడా ఉన్నాడు.
గోట్ టూర్ ఆఫ్ ఇండియా లో భాగంగా మెస్సీ ఇటీవల ఇండియా వచ్చాడు. కోల్ కతా లో ముందుగా పర్యటించాడు. కానీ ఆ టూర్ లో నానా రచ్చ జరిగింది. దీంతో గంటసేపు స్టేడియం లో ఉండాల్సిన మెస్సి వెంటనే వెళ్ళిపోయాడు.. హైదరాబాదులో అతని టూర్ అద్భుతంగా జరిగింది . ప్రభుత్వం ఈ టూర్ ను జాగ్రత్తగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఫుట్బాలర్ అవతారం ఎత్తారు.. స్వయంగా ఫుట్బాల్ ఆడారు. గోల్ కొట్టి సంచలనం సృష్టించారు. ఒక రకంగా కోల్ కతా టూర్ మెస్సీ కి ఇబ్బంది కలిగిస్తే.. హైదరాబాద్ టూర్ ఉపశమనాన్ని అందించింది. హైదరాబాద్ నుంచి మెస్సి ముంబై వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఆయనకు ఘన సత్కారం లభించింది. అయితే ఊహించని విధంగా మెస్సి అంబానీ వంతారాలో దర్శనమిచ్చారు.. అంతేకాదు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ తో ఫోటోలు కూడా దిగారు.
మెస్సీ జట్టు సభ్యులతో వంతార లో కలియ తిరిగారు. అక్కడ జంతువులను సంరక్షిస్తున్న తీరును చూసి ఆశ్చర్యపోయారు.. వాస్తవానికి మెస్సీ టూర్ లో వంతార సందర్శన లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ మెస్సీ వంతారను సందర్శించారు. అనంత్ అంబానీ ని కలిశారు. వంతార లో అడుగుపెట్టిన మెస్సి బృందానికి అనంత్ అంబానీ ఘన స్వాగతం పలికారు. సాధారణంగా మెస్సీ లాంటి వ్యక్తులను చూడాలంటనే వేలకు వేలు పోసి టికెట్లు కొనుగోలు చేయాలి. ఒకవేళ టికెట్లు కొనుగోలు చేసినా చూస్తామని నమ్మకం ఉండదు. అలాంటిది మెస్సి ని తమ వద్దకు రప్పించుకోవడం అంటే.. తెర వెనుక “మనీ” కట్టు మాయాజాలం ప్రదర్శించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. డబ్బుంటే కొండమీద కోతిని కాదు . చివరికి మెస్సీ ని కూడా కాళ్ల దగ్గరికి తీసుకురావచ్చు.. దానిని ప్రూవ్ చేశాడు అనంత్ అంబానీ!
View this post on Instagram