IPL Mini Auction 2026 SRH list: 2026 ఐపీఎల్ సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం జరిగిన మినీ వేలంలో అన్ని జట్లు కొంతమంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఇందులో హైదరాబాద్ జట్టు విభిన్నంగా కనిపిస్తోంది. అంతేకాదు, విధ్వంసకరమైన ప్లేయర్లతో పటిష్టంగా దర్శనమిస్తోంది.
హైదరాబాద్ జట్టులో ఇప్పటికే ప్రమాదకరమైన బ్యాటర్లు ఉన్నారు. వారికి తోడుగా మరింత భయంకరమైన బ్యాటర్లను హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. అభిషేక్ శర్మ, క్లాసెన్, ఇషాన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి వారితో హైదరాబాద్ జట్టు పటిష్టంగా ఉంది. ఇప్పుడు వారికి లివింగ్ స్టోన్, కార్స్, జాక్ ఎడ్వర్డ్స్ ను జత చేసింది.
భయంకరమైన బ్యాటర్లను హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈసారి 300 స్కోర్ పక్కా అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఐపీఎల్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా హైదరాబాద్ రికార్డ్ సృష్టించింది. ఇటీవల సీజన్లో హైదరాబాద్ 300 స్థాయిలో పరుగులు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, అది సాధ్యం కాలేదు. కానీ ఈసారి భీకరమైన బ్యాటర్లు ఉన్న నేపథ్యంలో 300 స్కోర్ పక్కా అని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు..
బలమైన బ్యాటింగ్ లైనప్ ను సృష్టించడానికే హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ ఈసారి సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారని స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భయంకరమైన బ్యాటర్లను తీసుకోవడం వెనుక ఉద్దేశం కూడా ఇదేనని తెలుస్తోంది. బ్యాటర్లు ముందుగా తమ పని తాము చేస్తే.. సగం విజయం సాధించినట్టేనని కావ్య నమ్ముతున్నారు. అందువల్లే ఈ స్థాయిలో బ్యాటర్లను తీసుకున్నారు. బౌలింగ్లో కూడా అదే స్థాయిలో జట్టును నడిపించడానికి కెప్టెన్ కమిన్స్ సిద్ధంగా ఉన్నాడు.