spot_img
Homeజాతీయ వార్తలుఎన్ని అడ్డంకులొచ్చినా దీక్ష కొనసాగిస్తాం..: కోదండరాం

ఎన్ని అడ్డంకులొచ్చినా దీక్ష కొనసాగిస్తాం..: కోదండరాం

Kodandaram
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఉద్యమ నేత ఆయన. జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపారు. తెలంగాణ వచ్చాక నిరాదరణకు గురైన ఆయన ఓ పార్టీని స్థాపించారు. అధికారంలోకి వచ్చిన టీఆర్‌‌ఎస్‌.. ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిన కేసీఆర్‌‌ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు. ఆయనే ప్రొఫెసర్‌‌ కోదండరాం.

Also Read: ‘వీహెచ్’ కథ వేరేలా ఉందిగా..!

నిత్యం ప్రజా సమస్యల మీద కోదండరాం పోరాడుతూనే ఉన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజాసమస్యలను పరిష్కరించే వరకు తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని ప్రకటించారు. నిరుద్యోగులు, రైతులు, ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు గాను చేపట్టిన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతినివ్వకపోవడం శోచనీయమన్నారు.

నిరుద్యోగ యువత, వ్యవసాయ సంక్షోభంతో దిగాలుపడ్డ రైతులు, దైన్యంలో ఉన్న ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కోదండరాం 48 గంటల దీక్షకు దిగారు. మొదటగా ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద దీక్షను నిర్వహించాలని నిర్ణయించగా.. పోలీసులు అనుమతించలేదు. దీంతో పార్టీ కార్యాలయంలోనే ఆయన దీక్షకు దిగారు. కోదండరాం దీక్షకు సీపీఐ, సీపీఎం, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, విద్యావేత్త చుక్కా రామయ్య సంఘీభావం ప్రకటించారు.

Also Read: ఓ వైపు చలి.. దానికితోడు వర్షం.. అయినా పట్టువదలని రైతులు

ప్రభుత్వం ఏర్పడి ఆరేళ్లయినా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం దారుణమని.. దీంతో అనేక మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం కూడా సంక్షోభంలో కూరుకుపోయిందని.. అన్నదాతలను కాపాడాల్సిన అవసరం కూడా ఉందన్నారు. 48 గంటలపాటు దీక్షను యథాతథంగా కొనసాగించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు హైదరాబాద్‌ చేరుకోవాలని పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper