ప్రభుత్వంపై కన్నా ఫైర్..!

ప్రజల మనోభావాలకు విరుద్ధంగా దేవాలయాల ఆస్తులను అమ్మితే చూస్తూ ఊరుకోనేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చెప్పారు. టిటిడి భూములు అమ్మాలని పాలక వర్గం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల ఆస్తుల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 29న పాలక మండలి తీర్మానం ఆమోదిస్తే ప్రోసిడింగ్స్ ఇచ్చేవరకు దాన్ని గోప్యంగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. నిరర్ధక ఆస్తుల పేరిట దేవాలయాల ఆస్తులను తెగనమ్మడం కుదరదని, […]

Written By: Neelambaram, Updated On : May 24, 2020 6:52 pm
Follow us on


ప్రజల మనోభావాలకు విరుద్ధంగా దేవాలయాల ఆస్తులను అమ్మితే చూస్తూ ఊరుకోనేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చెప్పారు. టిటిడి భూములు అమ్మాలని పాలక వర్గం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల ఆస్తుల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 29న పాలక మండలి తీర్మానం ఆమోదిస్తే ప్రోసిడింగ్స్ ఇచ్చేవరకు దాన్ని గోప్యంగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. నిరర్ధక ఆస్తుల పేరిట దేవాలయాల ఆస్తులను తెగనమ్మడం కుదరదని, సింహాచలం దేవస్థానం భూములను పలుచోట్ల కబ్జాకు కారణమయ్యాయని ప్రభుత్వం దేవాలయాల ఆస్తులు కాపాడాలని కోరారు. మరోవైపు భూములు అమ్మడం లేదని అనవసరంగా బిజెపి రాద్దాంతం చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి చెబుతున్నారని తెలిపారు. దేవాదాయ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని, దేవాదాయ భూముల అమ్మకం పై న్యాయపోరాటం కొనసాగిస్తామన్నారు.

జగన్ గత ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిలదీశారని, గత ప్రభుత్వ తప్పులపై విచారణ చేపట్టి బాద్యులైన వారిని జైలుకు పంపుతానని నమ్మించి మోసం చేశాడన్నారు. జగన్ నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ అధికారంలోకి వచ్చారని ఇప్పుడు నేను ఉన్నాను అనే మాట పక్కన పెట్టి నేనే అంతా అనే వరకూ వెళ్లారని విమర్శించారు. దేవాలయాల విషయంలో బిజెపి 9 నెలలుగా పోరాటాలు చేస్తుందని చెప్పారు.

భక్తులు తమ ఆస్తులు దేవుడు పేరుతో ఉండాలనే కోరికతో ఇచ్చారని చెప్పారు. కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టినట్టు భూములకు నిరార్దక భూములని పేరు పెట్టారన్నారు. ఒక్క గజం దేవుని భూమి అమ్మినా వీధి పోరాటాలు చేస్తామని అన్నారు. సింహాచలం భూములను సందట్లో సడేమియా అంటూ కబ్జా చేశారని విమర్శించారు. జాయింట్ కలెక్టర్ కు ఎండోమెంట్ అధికారాలు అప్పజెప్పడం దేవుని భూములకు రక్షణ ఉండదనే భావన ఉందని తెలిపారు. యదేశ్చగా దేవాదాయ భూములు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న దేవాదాయ భూముల అన్యాక్రాంతం పై బిజెపి పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం చేస్తాం. ప్రభుత్వ తీరు చూస్తుంటే భవిష్యత్తులో దేవాలయాల భూములకు రక్షణ ఉండదనే అనుమానం కలుగుతుందని చెప్పారు.