ఢిల్లీ పోరులో క్రీడాకారులు

  ఢిల్లీలో రైతుల పోరు ఆగడం లేదు. ఓ వైపు రైతు సంఘాలతో కేంద్ర ప్రభభుత్వం చర్చలు జరుపుతుండగా మరోవైపు రైతులు కిసాన్ బిల్లులను వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. అయితే వీరి నిరసనకు పంజాబ్ ముఖ్యమంత్రి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా రైతులకు క్రీడాకారులు బాసటగా నిలుస్తున్నారు. వారి మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నారు. కాగా రైతులు లేవనెత్తిన అంశాలపై చర్చించడానికి ఐదుగురితో కూడిన ఓ కమిటిని నియమిస్తానని ప్రభుత్వం మరోసారి చేసిన ప్రతిపాదనను 35 […]

Written By: Suresh, Updated On : December 3, 2020 4:54 pm
Follow us on

 

ఢిల్లీలో రైతుల పోరు ఆగడం లేదు. ఓ వైపు రైతు సంఘాలతో కేంద్ర ప్రభభుత్వం చర్చలు జరుపుతుండగా మరోవైపు రైతులు కిసాన్ బిల్లులను వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. అయితే వీరి నిరసనకు పంజాబ్ ముఖ్యమంత్రి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా రైతులకు క్రీడాకారులు బాసటగా నిలుస్తున్నారు. వారి మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నారు. కాగా రైతులు లేవనెత్తిన అంశాలపై చర్చించడానికి ఐదుగురితో కూడిన ఓ కమిటిని నియమిస్తానని ప్రభుత్వం మరోసారి చేసిన ప్రతిపాదనను 35 రైతు సంఘాలు మూకుమ్మడిగా తిరస్కరించాయి. ప్రధానంగా కేంద్రగా కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రైతుల నిరసనకు రోజురోజుకు మద్దతు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమవుతోంది.