ఎక్కడైనా రాజకీయాల్లో కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి అధినేతలు ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించడమో.. పురాణాలు చెప్పడమో.. సామెతలు చెప్పడమో చేస్తుంటారు. చీటికి మాటికి చమత్కారాలు విసురుతూ ఆసక్తి నింపుతుంటారు. కానీ.. అదేంటో జనసేనలో మాత్రం అదంతా రివర్స్. జనసేన అధినేత పవన్ కార్యకర్తలను నిరుత్సాహపరిచేందుకే ప్రయత్నిస్తుంటారట.
Also Read: కేసీఆర్‌లో ఈ మార్పులు ఎవరైనా ఊహించారా..!
నేడు తిరుపతి పర్యటనకు వచ్చిన పవన్.. కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఇదే సందర్భంలో కార్యకర్తలు ఎన్నికల సమరానికి సైసై అంటుండగా.. పవన్ మాత్రం కొంత వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనసేనకు కాపులు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా పడాలంటే తమ పార్టీ పోటీ చేయడమే ఉత్తమమని జనసేన నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు.
తిరుపతి ఉప ఎన్నికలో పోటీపై ప్రధానంగా నాయకులు అభిప్రాయాలను పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతి బరిలో జనసేన నిలవాలని తేల్చి చెప్పారు. బీజేపీకి ఇక్కడ అంత సీన్ లేదని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. పైగా ఏపీ బీజేపీ నేతలు తమపట్ల అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: పుసుక్కున గెలిచావ్ జగన్.. హేళన చేసిన పవన్
ఒకవేళ బీజేపీకి సీటు వదిలేస్తే వారికి సహకరించడం కుదరదని తేల్చిచెప్పారు. అందరి అభిప్రాయాలను తెలుసుకున్న పవన్‌కల్యాణ్ స్పందిస్తూ … బీజేపీ -జనసేన అభ్యర్థినే పోటీలో ఉంటారని చెప్పారు. అయితే అభ్యర్థి ఎవరనే విషయమై వారంలో తేల్చుతామన్నారు. అభ్యర్థి ఎవరైనా సహకరించాల్సిందేనని పవన్ అన్నారు. దీంతో పవన్ మరోసారి బీజేపీకే మద్దతు పలకాలని చెబుతారనే ఆందోళన నాయకులు, కార్యకర్తల్లో కనిపించింది. వారం గడిస్తే గానీ అసలు విషయం అర్థం కాని పరిస్థితి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్