https://oktelugu.com/

వాట్సాప్ వాడేవాళ్లకు అలర్ట్.. ఈ మెసేజ్ లతో జాగ్రత్త..!

దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు వాట్సాప్ యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వాట్సాప్ యాప్ లో ఫేక్ మెసేజ్ లు ఫార్వర్డ్ అవుతున్నాయి. చాలామంది ఆ ఫేక్ మెసేజ్ లను రియల్ మెసేజ్ లు అని నమ్మి మోసపోతున్నారు. తాజాగా వాట్సాప్ యాప్ లో వాట్సాప్ డైరెక్టర్ వరుణ్ పుల్యానీ పేరుతో ఒక వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. వైరల్ అయిన ఆ మెసేజ్ ను 20 మంది యూజర్లకు ఫార్వర్డ్ చేయాలని ఆ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 22, 2021 / 02:48 PM IST
    Follow us on

    దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు వాట్సాప్ యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వాట్సాప్ యాప్ లో ఫేక్ మెసేజ్ లు ఫార్వర్డ్ అవుతున్నాయి. చాలామంది ఆ ఫేక్ మెసేజ్ లను రియల్ మెసేజ్ లు అని నమ్మి మోసపోతున్నారు. తాజాగా వాట్సాప్ యాప్ లో వాట్సాప్ డైరెక్టర్ వరుణ్ పుల్యానీ పేరుతో ఒక వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. వైరల్ అయిన ఆ మెసేజ్ ను 20 మంది యూజర్లకు ఫార్వర్డ్ చేయాలని ఆ మెసేజ్ లో ఉంది.

    Also Read: గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు అలర్ట్.. పేమెంట్స్ చేయకూడని సమయమిదే..?

    మెసేజ్ వాట్సాప్ డైరెక్టర్ పేరుతో వైరల్ అవుతూ ఉండటంతో చాలామంది ఆ మెసేజ్ ను రియల్ మెసేజ్ అని నమ్ముతున్నారు. 20 మందికి వాట్సాప్ మెసేజ్ ను ఫార్వర్డ్ చేయకపోతే వాట్సాప్ సర్వీసులు వినియోగించుకుంటూ ఉండటం వల్ల కొంత మొత్తం ఛార్జీలుగా చెల్లించాలని ఆ మెసేజ్ లో ఉంది. వైరల్ అవుతున్న మెసేజ్ లో తన పేరు వాట్సాప్ డైరెక్టర్ వరున్ పుల్యాని అని వటాప్ ను 19 బిలియన్ డాలర్లకు మార్క్ జుకర్ బర్గ్ కు విక్రయించామని పొందుపరిచారు.

    Also Read: మధ్యతరగతికి మోదీ సర్కార్ శుభవార్త.. బడ్జెట్ లో 3 నిర్ణయాలు..?

    వాట్సాప్ మెసేజ్ ను 20 మందికి ఫార్వర్డ్ చేస్తే వాట్సాప్ లో ఫేస్ బుక్ యొక్క కొత్త చిహ్నాన్ని పొందుతారని.. ఫేస్ బుక్ రంగు మారడంతో పాటు కొత్త వాట్సాప్ ను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు ఈ మెసేజ్ లో ఉండే లింక్ లను పొరపాటున క్లిక్ చేస్తే మాత్రం సైబర్ మోసాల బారిన పడే అవకాశం ఉంటుంది. నిజానికి వాట్సాప్ సంస్థలో వరుణ్ పుల్యానీ పేరుతో ఎవరూ పని చేయడం లేదు.

    మరిన్ని వార్తల కోసం: జనరల్

    వాట్సాప్ వెబ్ సైట్ లో కూడా వరుణ్ పుల్యాణీ పేరుతో ఎవరి వివరాలు లేవు. కొంతమంది సైబర్ మోసగాళ్లు వాట్సాప్ ప్రైవసీ పేరుతో ఇలాంటి ఫేక్ మెసేజ్ లను పంపుతున్నారు. మొబైల్ కు వచ్చిన మెసేజ్ లలో నకిలీ మెసేజ్ లు ఉంటే జాగ్రత్త వహించాలి. అధికారిక సంస్థల నుంచి వచ్చే సందేశాలకు సంబంధించిన వివరాలను మాత్రమే నమ్మాలి.