దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు గూగుల్ పే, ఫోన్ పే, ఇతర యాప్ ల ద్వారా డిజిటల్ పేమెంట్లు జరుపుతున్నారు. యూపీఐ యాప్ ల ద్వారా ఒక నంబర్ నుంచి ఇంకో నంబర్ కు సులభంగా నగదు లావాదేవీలు చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్ కు మొబైల్ నంబర్ రిజిష్టర్ అయితే మాత్రమే లావాదేవీలను జరపడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం 24 గంటల పాటు బ్యాంక్ లావాదేవీలు జరిపే అవకాశం ఉంది.
Also Read: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. పాన్ కార్డు లింక్ చేయకపోతే నష్టపోయినట్లే..?
అయితే రాబోయే కోన్ని రోజులు రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ డిజిటల్ లావాదేవీలను జరపకూడదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్ని రోజులు లావాదేవీలను జరపకూడదనే వివరాలను పేర్కొనలేదు. అందువల్ల ఎన్‌పిసిఐ తెలిపేంత వరకు లావాదేవీలు జరపకపోవడమే మంచిది. ట్విట్టర్ ద్వారా ఎన్‌పిసిఐ ఈ విషయాలను వెల్లడించింది.
Also Read: వాట్సాప్ కు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. అసలేం జరిగిందంటే..?
యుపీఐ ప్లాట్‌ఫాం అప్‌గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా యూపీఐ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఆన్ లైన్ లావాదేవీల కొరకు గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్ లను వినియోగిస్తున్నారు. మొత్తం 165 బ్యాంకులు యూపీఐ ద్వారా లావాదేవీలు జరిపే అవకాశం యూజర్లకు కల్పిస్తున్నాయి. యూపీఐల ద్వారా లావాదేవీలు జరిపితే క్యాష్‌బ్యాక్ ఆఫర్ లను, డిస్కౌంట్ కూపన్లను పొందే అవకాశం ఉంటుంది.
మరిన్ని వార్తల కోసం: వ్యాపారము
క్యాష్ బ్యాక్ ఆఫర్ల వల్ల ఎక్కువమంది యూజర్లు డిజిటల్ పేమెంట్స్ యాప్ లను వినియోగిస్తున్నారు. యూపీఐ యాప్ ల ద్వారా ప్రతి నెల మిలియన్ల లావాదేవీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది నుంచి యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు విధిస్తారని ప్రచారం జరిగినా తరువాత కాలంలో ఆ ప్రచారం నిజం కాదని వెల్లడైంది.