అందరివాడు కాస్త.. కొందరి వాడే అవుతున్నాడా..!

అదేంటో.. దేశంలో ఎక్కడా ఎక్కువగా ఫోకస్‌ కాని కుల రాజకీయాలు ఏపీలోనే కనిపిస్తుంటాయి. ఏ పొలిటికల్‌ లీడర్‌‌ కొత్తగా వచ్చినా ముందుగా ఆయన కులాలను సెర్చ్‌ చేస్తుంటారు. ఆ తర్వాత ఆ నేత కూడా రాష్ట్రంలో కుల రాజకీయాలు నడిపిస్తుంటారు. ముఖ్యంగా కళాకారులకు కులం ఉండదని అంటుంటారు. గతంలో ఎన్టీఆర్‌‌ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన కులం గురించి పెద్దగా జనాలకు తెలియదు. ఆయనపై ఉన్న నమ్మకంతో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిని చేశారు […]

Written By: Srinivas, Updated On : January 27, 2021 11:46 am
Follow us on

అదేంటో.. దేశంలో ఎక్కడా ఎక్కువగా ఫోకస్‌ కాని కుల రాజకీయాలు ఏపీలోనే కనిపిస్తుంటాయి. ఏ పొలిటికల్‌ లీడర్‌‌ కొత్తగా వచ్చినా ముందుగా ఆయన కులాలను సెర్చ్‌ చేస్తుంటారు. ఆ తర్వాత ఆ నేత కూడా రాష్ట్రంలో కుల రాజకీయాలు నడిపిస్తుంటారు. ముఖ్యంగా కళాకారులకు కులం ఉండదని అంటుంటారు. గతంలో ఎన్టీఆర్‌‌ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన కులం గురించి పెద్దగా జనాలకు తెలియదు. ఆయనపై ఉన్న నమ్మకంతో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిని చేశారు ప్రజలు. ఆ తరువాత అంతటి సినీ గ్లామర్‌‌తోపాటు గట్టి ఇమేజ్ ఉన్న చిరంజీవి పార్టీ పెడితే జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. దానికి కారణం ఆయన పార్టీకి కులపరమైన ప్రచారం ఎక్కువగా తీసుకురావడమే.

Also Read: నిమ్మగడ్డ అభిశంసన అస్త్రం.. ఆ ఇద్దరిపై సర్కార్ ఏం చేయనుంది?

తాను అందరి వాడినంటూ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ 2019 నాటికి మాత్రం చాలా రకాలుగా జనంలో నానారు. ఆయన చివరికి పోటీ చేసిన రెండు సీట్లూ కూడా కాపులు ప్రాబల్యం ఉన్నవే. ఇలా ప్రజారాజ్యం, జనసేనలకు రెండు చేదు అనుభవాలు కళ్ల ముందే అలా ఉన్నాయి. కానీ.. ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్ అదే తప్పు చేస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏ రాజకీయ నాయకుడు అయినా గెలవాలి అంటే అన్ని వర్గాల నుంచి ఆదరణ పొందాలి. ఎన్టీఆర్‌‌కు చంద్రబాబుకు వెనక ఉన్న సామాజిక వర్గం ఓట్ల శాతం చాలా తక్కువ. అలాగే జగన్, వైఎస్సార్‌‌లకూ సామాజిక వర్గం ఓట్లు తక్కువే. కానీ.. వీరంతా కులాల గోడలను చీల్చుకుని బయటకు వచ్చారు. తమ రాజకీయాల ద్వారా అందరివారు అని అనిపించుకున్నారు.

అయితే.. పవన్ కల్యాణ్ కూడా జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఇలాంటి వేదాలు వల్లించారు. కానీ.. ఇప్పుడు వాటికి మెల్లమెల్లగా నీళ్లు వదులుతున్నట్లే కనిపిస్తంది. బీజేపీతో పొత్తు ద్వారా హిందూత్వ అజెండాను పవన్ భుజానికెత్తుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ చేస్తున్న కుల రాజకీయం కూడా మిత్రుడిగా పవన్‌కు చుట్టుకునేలా ఉందని అంటున్నారు.

Also Read: నిమ్మగడ్డకు జగన్ భారీ షాక్.. ఏకగ్రీవాలతో చెక్

ఏపీలో మత రాజకీయాలకు అసలు తావు లేదు. అలాగే ఒక కులానికి చెందిన నాయకులకు గంపగుత్తగా ఓట్లు వేసి గెలిపించిన చరిత్ర కూడా లేదు. బీజేపీ ఓ వైపు మతాన్ని దువ్వుతూనే మరోవైపు కాపులకు గాలం వేస్తోంది. ఈ రెండు విభిన్న మార్గాల ద్వారా పయనం చేయడం ద్వారా బీజేపీ ఎంతవరకూ రాజకీయ లక్ష్యాన్ని చేరుతుందో తెలియదు. కానీ.. పవన్ అందరివాడు ఇమేజ్‌ను మాత్రం డ్యామేజీ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ బీజేపీ ఆడుతున్న ఈ సంకుచిత రాజకీయ క్రీడ నుంచి బయటకు వచ్చి అందరివాడుగా జనంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్