సాధారణంగా ఎక్కువగా కష్టపడి పని చేస్తే త్వరగా అలసిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే కొందరు పెద్దగా పని చేయకపోయినా త్వరగా అలసిపోతూ ఉంటారు. కొంతమందికి విశ్రాంతి తీసుకుంటే నీరసం, అలసట తగ్గుతాయి. మరి కొంతమంది మాత్రం విశ్రాంతి తీసుకున్నా వారాల పాటు, నెలల పాటు అలసట, నీరసం సమస్యలు వేధిస్తాయి. కొన్ని సందర్భాల్లో డిప్రెషన్ కూడా అలసట, నీరసంకు కారణమవుతుంది.
అలసట, నీరసం లాంటి సమస్యలతో బాధ పడే వారిలో అరికాళ్లు, అరిచేతులు నొప్పిగా అనిపించడం, కాళ్లు లాగడం జరుగుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా నీరసం, అలసటలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా నీరసం, అలసట సమస్యలు దూరమవుతాయి. అలసట, నీరసం తగ్గాలంటే మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
పాలు, ఓట్స్, బాదంపప్పు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన మాంసకృత్తులు లభిస్తాయి. పాలు, పండ్ల రసాలు, జావలను తీసుకుంటే జీవక్రియ రేటు పెరిగి అలసట, నీరసం తగ్గుతాయి. కూరగాయల ముక్కలు, మొలకలు, పండ్లు తీసుకోవడం ద్వారా కూడా నీరసం, అలసట సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బయట ఆహారాలు, మసాలా పదార్థాలు తినడం వల్ల కూడా జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
అప్పడాలు, నూనెలో వేయించిన చిరుతిళ్లను వీలైనంత తక్కువగా తీసుకుంటే మంచిది. ఆహార పదార్థాల్లో ఉప్పును వీలైనంతగా తగ్గించడంతో పాటు తరచూ నీళ్లను తీసుకోవాలి. అల్లం తరుగు, కీరదోస ముక్కలు, నిమ్మరసం పిండిన నీళ్లను రోజూ తీసుకున్నా అలసట, నీరసం తగ్గించవచ్చు.