https://oktelugu.com/

జగన్ పక్కా వ్యూహం.. టీడీపీకి ఎన్టీఆర్ దూరం..!

ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడ‌లు అవుతాయనే నానుడి ప్రస్తుత ఏపీ రాజకీయాలకు కరెక్టుగా సరిపోతుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ముప్పుతిప్పలు పెట్టారు. ఇక ఐదేళ్లలోనే చంద్రబాబు పరిస్థితి పూర్తి రివర్స్ అయింది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ జోరుగా టీడీపీ బొక్కబోర్లా పడింది. టీడీపీ గతంలో ఎన్నడూ చూడని దారుణ పరాభవాన్ని చవిచూసింది. కేవలం 23సీట్లను టీడీపీ దక్కించుకోగా అందులో చాలామంది ఇప్పటికే వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 20, 2020 / 02:22 PM IST
    Follow us on


    ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడ‌లు అవుతాయనే నానుడి ప్రస్తుత ఏపీ రాజకీయాలకు కరెక్టుగా సరిపోతుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ముప్పుతిప్పలు పెట్టారు. ఇక ఐదేళ్లలోనే చంద్రబాబు పరిస్థితి పూర్తి రివర్స్ అయింది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ జోరుగా టీడీపీ బొక్కబోర్లా పడింది. టీడీపీ గతంలో ఎన్నడూ చూడని దారుణ పరాభవాన్ని చవిచూసింది. కేవలం 23సీట్లను టీడీపీ దక్కించుకోగా అందులో చాలామంది ఇప్పటికే వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు.

    Also Read: వైసీపీ ఎంపీకి లోక్ సభలో సీటు ఛేంజ్..

    సీఎంగా జగన్ పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి టీడీపీకి గడ్డుకాలం మొదలైంది. ఆ పార్టీలో నేతలంతా ఒక్కొక్కరుగా జగన్ కు జై కొడుతున్నారు. టీడీపీ హయాంలో జరిగిన స్కాములను జగన్ సర్కార్ బయటికి తీసి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన నేతలను జైళ్లకు పంపిస్తోంది. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు అరెస్టయి జైళ్లకు వెళ్లగా మరికొందరిని పంపించేందుకు జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు.

    ఇప్పటికే బలహీనంగా మారిన టీడీపీని మరింత దెబ్బతీసేందుకు జగన్ పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును జగన్ సర్కార్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. టీడీపీ కంచుకోటగా ఉన్న దివంగత ఎన్టీఆర్ ఓటుబ్యాంకును వైసీపీ తనవైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తోంది. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేయని పని జగన్ సర్కార్ చేయనుంది. దీనివల్ల చంద్రబాబుకు చెక్ పెట్టడంతోపాటు ఎన్టీఆర్ అభిమానులు జగన్ పేరును ఎల్లప్పుడు గుర్తుంచుకుంటారు.

    గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలమా? వ్యతిరేకమా?

    ఒకవేళ ఇది జరిగితే చంద్రబాబు ఎన్టీఆర్, ఆయన కుటుంబాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారనే ఆరోపణలు మరోసారి వెల్లువెత్తడం ఖాయంగా కన్పిస్తుంది. ఇప్పటికే బాబు ఎన్టీఆర్ కు వెన్నుపొటు పొడిచారనే అపవాదును మోస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు పెట్టలేకపోయారనే నిందనే ఆయన జీవితాంతం మోయాల్సి రావడం ఆయనకు ఇబ్బందికరంగా మారనుంది.

    మరోవైపు బాలకృష్ణ సైతం హిందూపురాన్ని జిల్లా చేయాలని కోరాడే తప్ప తన తండ్రి పేరును జిల్లాకు పెట్టాలని సీఎం జగన్ ను ఆయన కోరలేదు. ఇదికూడా జగన్ కు కలిసొచ్చింది. ఎన్టీఆర్ నిజమైన వారసుడు జగన్ అనేలా వైసీపీ నేతలు ఇప్పటికే చెప్పుకుంటున్నాయి. దీంతో ఇప్పటివరకు టీడీపీకి మద్దతుగా ఉన్న ఎన్టీఆర్ వీరాభిమానులు జగన్ సర్కార్ జై కొట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్న టీడీపీకి ఇది మరింత ఇబ్బందికరంగా మారడం ఖాయంగా కన్పిస్తుంది.