https://oktelugu.com/

జూలై 24న కేసీఆర్ పెద్ద ప్రకటన చేస్తారా?

సీఎం కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు.. కేటీఆర్ కు రాష్ట్ర రాజకీయాలు.. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మరోసారి తెరపైకి వచ్చిందని తెలిసింది. రాహుల్ గాంధీలా కేటీఆర్ ఆగం కావద్దని.. కేసీఆర్ ఇప్పుడే రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం టీఆర్ఎస్ లో ఎప్పటి నుంచో ఉంది. తను ఉన్నప్పుడే కేటీఆర్ ను సీఎం చేసి కేసీఆర్ పర్యవేక్షించేలా రంగం సిద్ధం చేసుకున్నాడనే ప్రచారం ఉంది. హరీష్ రావు లాంటి బలమైన నేతను నిలువరించి కేటీఆర్ ను సీఎం చేయాలంటే […]

Written By:
  • NARESH
  • , Updated On : July 20, 2020 / 01:55 PM IST
    Follow us on


    సీఎం కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు.. కేటీఆర్ కు రాష్ట్ర రాజకీయాలు.. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మరోసారి తెరపైకి వచ్చిందని తెలిసింది. రాహుల్ గాంధీలా కేటీఆర్ ఆగం కావద్దని.. కేసీఆర్ ఇప్పుడే రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం టీఆర్ఎస్ లో ఎప్పటి నుంచో ఉంది. తను ఉన్నప్పుడే కేటీఆర్ ను సీఎం చేసి కేసీఆర్ పర్యవేక్షించేలా రంగం సిద్ధం చేసుకున్నాడనే ప్రచారం ఉంది. హరీష్ రావు లాంటి బలమైన నేతను నిలువరించి కేటీఆర్ ను సీఎం చేయాలంటే అది కేసీఆర్ ఉన్నప్పుడే సాధ్యం. అందుకే తాజాగా మరో ప్రచారం ఊపందుకుంది.

    కేసీఆర్, జగన్.. అందులోనూ అన్నాదమ్ములే?

    కేసీఆర్ తన కొడుకు, మంత్రి కేటీఆర్ కు మార్గం సుగమం చేయడానికి సమయం ఆసన్నమైందని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ను త్వరలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయబోతున్నారని సమాచారం. శ్రావణ మాసంలోనే దీనికి ముహూర్తం సిద్ధం చేసినట్టు చెబుతున్నారు.

    టీఆర్ఎస్ పై విపరీతంగా విరుచుకుపడే ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక కేటీఆర్ ను సీఎంగా పట్టాభిషేకం చేయబోతున్నారంటూ ఒక బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. కేసీఆర్ పెట్టిన అన్ని పరీక్షలలో కేటీఆర్ పాస్ అయ్యారని.. అధికారం కల్పించడానికి అన్ని అర్హతలు సంపాదించారని కేసీఆర్ డిసైడ్ అయినట్టు రాసుకొచ్చింది.

    అంతేకాదు.. జూలై 24న కేసీఆర్ పుట్టినరోజు కావడంతో అదే రోజున కేటీఆర్ ను పట్టాభిషేకం చేయబోతున్నట్టు సంచలన విషయాన్ని లీక్ చేసింది. కేసీఆర్ జూలై 24న ఒక పెద్ద ప్రకటన చేయబోతున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోందని మీడియా సంస్థ తెలిపింది.

    మామ సీటు కోసం అల్లుడి వేషాలు..!

    గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే ప్రధాని పదవి చేపట్టి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించారు. జాతీయ నాయకులతో సంప్రదింపులు జరిపారు. కానీ నెరవేరలేదు. దీంతో రాబోయే 2024 ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ కు పగ్గాలు అప్పగించి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయడానికి ఫుల్ టైం పనిచేయడానికి వీలుగా తెలంగాణ సీఎం బాధ్యతలను కేసీఆర్ వదులుకుంటున్నాడని.. కేటీఆర్ కు అప్ప జెప్పబోతున్నాడని తెలిసింది. మరి ఇది నిజమా కాదా అన్నది జూలై 24న తేలనుంది. అప్పటివరకు వేచిచూడడమే..