https://oktelugu.com/

ఎమ్మెల్సీ రేసు.. నేతల్లో పెరుగుతున్న టెన్షన్..!

ఏపీలో ఎమ్మెల్సీ పదవుల రేసు మొదలైంది. వైసీపీ అధికారంలో ఉండటంతో ఎమ్మెల్సీ కోసం నేతలు పోటీపడుతున్నారు. వైసీపీ నేతల రాజీనామాలతో రెండు, గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా ఇప్పటివరకు ఏ ఒక్కపేరు అధికారికంగా వెల్లడికాలేదు. వైసీపీలోని ఆశావహులు ఎమ్మెల్సీ సీటు తమకే దక్కుతుందని నమ్మకంతో ఉన్నప్పటికీ లోలోపల మాత్రం టెన్షన్ పడుతున్నారు. Also Read: ట్వీట్లకు ఓట్లు రాలుతాయా లోకేష్..? వైసీపీ నుంచి రోజుకోపేరు తెరపైకి వస్తుండటంతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 20, 2020 / 02:56 PM IST
    Follow us on


    ఏపీలో ఎమ్మెల్సీ పదవుల రేసు మొదలైంది. వైసీపీ అధికారంలో ఉండటంతో ఎమ్మెల్సీ కోసం నేతలు పోటీపడుతున్నారు. వైసీపీ నేతల రాజీనామాలతో రెండు, గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా ఇప్పటివరకు ఏ ఒక్కపేరు అధికారికంగా వెల్లడికాలేదు. వైసీపీలోని ఆశావహులు ఎమ్మెల్సీ సీటు తమకే దక్కుతుందని నమ్మకంతో ఉన్నప్పటికీ లోలోపల మాత్రం టెన్షన్ పడుతున్నారు.

    Also Read: ట్వీట్లకు ఓట్లు రాలుతాయా లోకేష్..?

    వైసీపీ నుంచి రోజుకోపేరు తెరపైకి వస్తుండటంతో అధిష్టానం లీకులిస్తుందా? లేదా నేతలే కావాలనే ప్రచారం చేసుకుంటున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీని నమ్ముకొని గతంలో ఎమ్మెల్యే అవకాశం దక్కనివారికి ఈసారి ఎమ్మెల్సీ దక్కుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినవారికే అవకాశం దక్కుతుందని నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే పార్టీలో నేతల మధ్య పోటీతీవ్రంగా ఉండటంతో చివరి వరకు ప్రయత్నాలు కొనసాగించేందుకే నేతలు మొగ్గుచూపుతున్నారు.

    వైసీపీ నుంచి ఎమ్మెల్సీలో రేసులో ప్రముఖంగా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ విన్పిస్తుంది. ఆయన జగన్ కు నమ్మకస్తుడిగా ఉన్నారు. కిందటి ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎమ్మెల్సీ పదవీని త్యాగంచేసి టీడీపీ నుంచి వచ్చిన విడుదల రజనికీ తన సీటును కేటాయించారు. దీంతో ఆయనను ఎమ్మెల్సీ చేస్తానని జగన్ అప్పుడే హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయనకు ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత కొయ్య మోషేన్ రాజు పేరు కూడా బలంగా విన్పిస్తోంది.

    Also Read: నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ తాజా నిర్ణయం ఇదే..

    వీరితోపాటు టీడీపీ నుంచి వైసీపీ చేరిన మాజీ మంత్రి పండుల రవీంద్రబాబు, కడప జిల్లాకు చెందిన మైనార్టీ నేత జకియా ఖాన్ పేర్లు ఎమ్మెల్సీ రేసులో ప్రముఖంగా విన్పిస్తున్నాయి. సామాజిక వర్గంలో కోణంలో వీరిపేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గం నుంచి రవీంద్రబాబు, మైనార్టీ నుంచి జకియా ఖాన్ పేర్లు విన్పిస్తున్నారు. పార్టీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ వీరి పేర్లను ముందస్తు లీకుచేసి నేతల అభిప్రాయానని అధిష్టానం తెలుసుకుంటోందనే టాక్ విన్పిస్తుంది.

    ప్రస్తుతానికి వీరి పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలున్నాయని ఆశావహులు భావిస్తున్నారు. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్సీ సీట్ల రాజకీయం జోరుగా సాగుతుండటం గమనార్హం.