జగన్ ఆ నేతకు న్యాయం చేయలేకపోతున్నారా?

వైసీపీనే నమ్ముకొని ఉన్న ఆ నేతకు మాత్రం పదవీ మాత్రం దక్కడం లేదు. జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్న సదరు నేతకు ప్రతీసారి అన్యాయం జరుగుతుండటం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తయినప్పటికీ ఆ నేతకు సరైన అవకాశం దక్కకపోవడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకీ ఆ నేత ఎవరనే కదా మీ సందేహం.. ఆయనేవరో కాదు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్. Also Read: సీటు మారినా […]

Written By: Neelambaram, Updated On : July 20, 2020 12:45 pm
Follow us on


వైసీపీనే నమ్ముకొని ఉన్న ఆ నేతకు మాత్రం పదవీ మాత్రం దక్కడం లేదు. జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్న సదరు నేతకు ప్రతీసారి అన్యాయం జరుగుతుండటం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తయినప్పటికీ ఆ నేతకు సరైన అవకాశం దక్కకపోవడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకీ ఆ నేత ఎవరనే కదా మీ సందేహం.. ఆయనేవరో కాదు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్.

Also Read: సీటు మారినా పర్లేదు…ఫేటు మారకుండా చూసుకో రాజా..!

వైసీపీ కష్టకాలంలోనూ మర్రి రాజశేఖర్ పార్టీనే నమ్ముకొని ఉన్నారు. కిందటి ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే సీటు దక్కుతుందని ప్రచారం జరిగింది. ఆయన కూడా సీటు తనకు వస్తుందని చిలకలూరిపేటలో ముందస్తు ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే అనూహ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన విడుదల రజనీకీ ఎమ్మెల్యే సీటు దక్కింది. దీంతో ఆయన జగన్ పై అలక చెందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో రాజశేఖర్ కిందటి ఎన్నికల్లో రజనీ గెలుపు కోసం పనిచేశారు. ఈ ఎన్నికల్లో రజనీ విజయం సాధించడంతో రాజశేఖర్ కు ఎమ్మెల్సీ దక్కుతుందని అందరూ భావించారు.

ప్రస్తుతం ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో రాజశేఖర్ కు ఛాన్స్ దక్కుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు జగన్ సర్కార్ శాసన మండలి రద్దుకే మొగ్గుచూపుతుంది. దీంతోనే ఎమ్మెల్సీలుగా ఉన్న మోపిదేవీ వెంకటరమణ,, పిల్లి సుభాస్ చంద్రబోస్ లకు జగన్ రాజ్యసభ సీటు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవీ దక్కినా అది మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: గుట్కాల తయారీ ఎమ్మెల్యే నిర్వాకమేనా?

వైసీపీలో పదవుల కోసం నేతల పోటీ తీవ్రంగా ఉండటంతో రాజశేఖర్ కూడా ఎమ్మెల్సీ దక్కడం కూడా కష్టమనేని పార్టీలో టాక్ విన్పిస్తోంది. దీంతో రాజశేఖర్ ఇష్యూ జగన్మోహన్ రెడ్డికి సమస్యగా మారనుంది. పార్టీని, తనను నమ్ముకొని ఉన్న నేతకు న్యాయం చేయలేకపోతే జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కన్పిస్తోంది. జగన్ మాటిచ్చారంటే నిలుపుకుంటారనే ప్రజల్లో టాక్ ఉంది. దీంతో సీఎం జగన్ ఆయనకు ఎలా న్యాయం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.