https://oktelugu.com/

గుట్కాల తయారీ ఎమ్మెల్యే నిర్వాకమేనా?

ఏపీ-తమిళనాడు సరిహద్దులో  పట్టుబడ్డ రూ.5.27 కోట్ల విషయంపై ప్రకాశం జిల్లా అధికార పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మరువక ముందే మరో అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన గోదాములో చట్ట విరుద్ధంగా గుట్కాలు తయారీ విషయం బయట పడటం ప్రతిపక్షాల చేతికి మరో అస్త్రం దొరికినట్లయ్యింది. గుంటూరు జిల్లాకు చెందిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫాకు చెందిన గోదాములో నిషేదిత గుట్కాలు తయారు చేస్తుండగా గుంటూరు పోలీసులు దాడి చేసి అక్కడ పని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 20, 2020 / 11:17 AM IST
    Follow us on


    ఏపీ-తమిళనాడు సరిహద్దులో  పట్టుబడ్డ రూ.5.27 కోట్ల విషయంపై ప్రకాశం జిల్లా అధికార పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మరువక ముందే మరో అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన గోదాములో చట్ట విరుద్ధంగా గుట్కాలు తయారీ విషయం బయట పడటం ప్రతిపక్షాల చేతికి మరో అస్త్రం దొరికినట్లయ్యింది. గుంటూరు జిల్లాకు చెందిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫాకు చెందిన గోదాములో నిషేదిత గుట్కాలు తయారు చేస్తుండగా గుంటూరు పోలీసులు దాడి చేసి అక్కడ పని చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడంతోపాటు గోదాము, అందులో ఉన్న రూ. కోట్లు విలువ చేసే గుట్కా తయారీ సామాగ్రి, యంత్రాలను సీజ్ చేశారు. జిల్లాలోని పెదకాకాని మండలం కొప్పురావూరు వద్ద ఉన్న ఈ గోదాములో గుట్కాల తయారీ సాగుతుంది. రాజకీయ నాయకుడికి చెందిన వ్యవహారం కావడంతో ఈ తనిఖీల్లో స్వయంగా ఎస్పీ అమ్మిరెడ్డి పాల్గొన్నారు.

    Also Read: వైసీపీ ఎంపీకి లోక్ సభలో సీటు ఛేంజ్..

    గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా గత కొద్ది రోజులుగా వివాదాలకు కేంద్ర బింధువుగా మారారు. కరోనా లాక్ డౌన్ సమయంలో నిబందనలకు వ్యతిరేకంగా అధిక సంఖ్యలో బందువులు, రాజకీయ నాయకులకు విందు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదర్కొన్నారు. ఈ విందులో పాల్గొన్న కొందరికి కరోనా వైరస్ సోకింది. స్వయంగా ముస్తఫా కుటుంబం వైరస్ అనుమానంతో క్వారంటైన్ లో ఉంది. ముస్తఫా ఇచ్చిన విందు విషయంలో విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టడంతో… తాను విందు ఇవ్వలేదని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ముస్తఫా వెల్లడించారు. తాజాగా ముస్తఫాకు చెందిన గోదాములో నిషేధిత గుట్కాల తయారీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది.

    గుంటూరు నగరానికి చెందిన ఎం.సుధాకర్ రెడ్డి పేరుతో గోదాములో పాన్ మసాలా తయారీకి అనుమతి పొంది నిషేదిత గుట్కాలు తయారు చేస్తున్నారని పోలీసులు తనిఖీలో గుర్తించారు. సంస్థ సూపర్ వైజర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోగా సుధాకర్ రెడ్డి, అతని భాగస్వామి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు గోదాములో గుట్కాల తయారీ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని గుంటురు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు. ఆ ప్రాంతంలో తనకు పోగాకు వ్యపార నిమిత్తం అనేక గోదాములు నిర్మించానని, ఒక గోదాము ఖాళీగా ఉండటంతో అద్దెకు ఇచ్చినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో తన పాత్ర ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

    Also Read: నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ తాజా నిర్ణయం ఇదే..

    గోదాములో గుట్ట్కాల తయారీకి అధికార పార్టీ నాయకుల అండదండలతోనే సాగుతుందని టిడిపి ఆరోపిస్తుంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ముడి సరుకును బట్టీ చూస్తే భారీగా గుట్కాలు ఇక్కడ తయారు చేసి ఇతర ప్రాంతాలకు పంపతున్నట్లు తెలిసిందని చెప్పారు. పాన్ మసలా తయారీకి అనుమతి పొందిన సుధాకర్ రెడ్డి ముస్తఫా అనుచరుడేనని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలన్నారు. నిషేదిత గుట్కాల తయారీ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.