జగన్ వ్యూహాలను అందుకోవడం అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు సాధ్యం కావడం లేదు. బహుశా యంగ్ పొలిటీషియన్ ఆలోచనల పదును ముందు, ఆయన అవుట్ డేటెడ్ ఆలోచనలు పనికి రావడం లేదనుకుంటా. జగన్ నిర్ణయాలు బాబును ప్రజలకు దూరం చేస్తూ వస్తున్నాయి. అందులో ముఖ్యంగా అమరావతి అంశం కూడా ఒకటి. మూడు రాజధానుల నిర్ణయంతో బాబును అమరావతి ఉద్యమానికి పరిమితం చేసి, రెండు ప్రాంతాల ప్రజల దృష్టిలో బాబును విలన్ గా చేశారు. అమరావతి ఉద్యమం గురించి ఆయన మాట్లాడుతుంటే పట్టుమని పది మంది కూడా ఆయన సందేశం చూడలేదు. ఆ చూస్తున్న వారిలో కూడా చాలా మంది మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా కామెంట్స్ రూపంలో ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు.
జగన్ అస్త్రాన్నే ప్రయోగిస్తున్న బీజేపీ-పవన్
ఈ సారి టీడీపీ కంచుకోటలోనే జగన్ బాబుకు చెక్ పెట్టే ఆలోచన చేస్తున్నాడు. కృష్ణా జిల్లాకు టీడీపీ స్థాపకుడు మరియు ఆ పార్టీ మూలపురుషుడు అయిన ఎన్టీఆర్ పేరును ఖరారు చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఎన్నికల సమయంలోనే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ హామీ ఇచ్చి సంచలనం రేపాడు. టీడీపీ కూడా ఎప్పుడూ చేయని ఈ ఆలోచన జగన్ చేయడంతో ప్రత్యర్థులకు షాక్ కొట్టింది. ఐతే జీవనది కృష్ణ పేరుమీద ఏర్పాటైన జిల్లాకు ఎన్టీఆర్ పేరుపెట్టడాన్ని కొందరు వ్యతిరేకించారు. ఐతే అటు ఆ వర్గం నుండి వ్యతిరేకత రాకుండా…ఇటు టీడీపీకి ఝలక్ ఇచ్చేలా జగన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.
జగన్ కు మరో లేఖాస్రం సంధించిన ఎంపీ రాజు..!
ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తానని హామీ ఇచ్చిన జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దీనిపై అధికారులకు దిశా నిర్ధేశం చేసిన జగన్ త్వరలో 26 జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయనున్నాడు. దీనితో కృష్ణా జిల్లా నుండి మచిలీపట్నం వేదికగా మరో జిల్లా ఏర్పడనుంది. కొత్తగా ఏర్పడే ఆ జిల్లాకు జగన్ ఎన్టీఆర్ పేరు పెట్టే ఆలోచనలో ఉన్నారు. మరి అదే కనుక జరిగితే టీడీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చినట్లే. మూడు రాజధానుల వలన ఏర్పడిన అసంతృప్తి నుండి జగన్ ఈ విధంగా బయటపడే అవకాశం ఉంది. తమ పార్టీ వ్యవస్థాపకుడికి జగన్ ఇచ్చిన గౌరవం 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు ఇవ్వలేకపోయారని టీడీపీ వర్గాలలోనే బాబు అబాసుపాలు కావడం ఖాయం.