https://oktelugu.com/

వైరస్ ల ఖార్ఖానాగా చైనా ఎందుకు మారుతుంది?

ప్రపంచానికి కరోనా వైరస్ ను అంటించి చోద్యం చూస్తున్న చైనాను అంత తేలికగా వదిలిపెట్టడం లేదు మహమ్మారులు. ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రాణాలు పోవడానికి కారణమైన చైనీయులను కొత్త వైరస్ లు పుట్టుకొచ్చి మరీ ఆడుకుంటున్నాయి. ఇప్పటికే కరోనాను పుట్టించి ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్న చైనాలో.. వారం కింద జీ4 అనే కొత్త వైరస్ ను కనుగొన్నారు. చైనాలో ఈ వైరస్ పందుల నుంచి మనుషులకు వ్యాపించింది. అది మరువకముందే మరో కొత్త మహమ్మారి చైనాలోనే పురుడుపోసుకోవడం ఆందోళన […]

Written By:
  • NARESH
  • , Updated On : July 6, 2020 / 11:22 AM IST
    Follow us on


    ప్రపంచానికి కరోనా వైరస్ ను అంటించి చోద్యం చూస్తున్న చైనాను అంత తేలికగా వదిలిపెట్టడం లేదు మహమ్మారులు. ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రాణాలు పోవడానికి కారణమైన చైనీయులను కొత్త వైరస్ లు పుట్టుకొచ్చి మరీ ఆడుకుంటున్నాయి. ఇప్పటికే కరోనాను పుట్టించి ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్న చైనాలో.. వారం కింద జీ4 అనే కొత్త వైరస్ ను కనుగొన్నారు. చైనాలో ఈ వైరస్ పందుల నుంచి మనుషులకు వ్యాపించింది. అది మరువకముందే మరో కొత్త మహమ్మారి చైనాలోనే పురుడుపోసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అదే ‘బుబోనిక్’ వ్యాధి. ఇదో ప్లేగు వ్యాధి. బ్యాక్టీరియా వల్ల సోకుతుందని వైద్యులు తేల్చారు.

    జగన్ అస్త్రాన్నే ప్రయోగిస్తున్న బీజేపీ-పవన్

    కరోనాతోనే జనాలు సగం చస్తుంటే కొద్దిరోజుల క్రితం చైనాలోనే మరోకొత్త రకం వైరస్ జీ4 ప్రబలింది. పందుల నుంచి మనుషులకు ఇది వ్యాప్తి చెందిందని చైనా వైద్యులు గుర్తించారు. ఈ వైరస్ కు జీ4గా చైనా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. వైరస్ చైనాలో పందుల కబేళాలలో పనిచేస్తున్న వారికి సోకిందని సోమవారం వెల్లడించిన నివేదికలో తెలిపారు. 2016-18 వరకు పందులను పెంచే 10శాతం మందికి సోకింది. తాజాగా చైనాలోని హుబే, షాండోంగ్ ప్రావిన్సుల్లో జనాభాలో 4.4శాతం మందికి జీ4 వైరస్ సోకినట్టు తేలింది. పరీక్షలు నిర్వహించి వారిని వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఉంచి చికిత్స చేస్తున్నారు. వీరితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి క్వారంటైన్ చేస్తున్నారు. ఈ కేసులు పందుల పెంపకం ఎక్కువగా ఉండే హుబే, షాండోంగ్ ప్రావిన్సుల్లో గుర్తించారు. తాజాగా ఆ ప్రాంతాల్లో 18-35 ఏళ్లలోని 20.5శాతం మందికి పాజిటివ్ గా తేలిందని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు.

    ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుందని.. మహమ్మారిగా మారవచ్చని చైనా పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కొత్తరకం వైరస్ కాబట్టి దీన్నుంచి కాపాడుకునే రోగ నిరోధక శక్తి ప్రజలకు తక్కువగా ఉంటుందని.. మరణాలు సంభవించే అవకాశాలుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గుర్తించిన ఈ వైరస్ పందుల ద్వారా వ్యాపిస్తోంది. స్వైన్ ఫ్లూ లక్షణాలున్న హెచ్1ఎన్1కు దగ్గరి పోలికలున్నాయి. 2011లోనే దీనిపై పరిశోధనలు చేశారు. 2016 తర్వాత ఇది మరింత బలంగా మారినట్లు తేలింది. కరోనా మాదిరే ఇది ప్రమాదకరంగా మారవచ్చని పరిశోధకులు హెచ్చరించారు.

    జగన్ కు మరో లేఖాస్రం సంధించిన ఎంపీ రాజు..!

    ఇక జీ4 వైరస్ ను మరిచిపోకముందే చైనాలో మరో మహమ్మారి కలకలం రేపుతోంది. చైనాలో తాజాగా ‘బుబోనిక్ ప్లేగు’ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కొత్త బుబోనిక్ ప్లేగు వ్యాధితో జ్వరం, తలనొప్పి, చలి, వాపులు, లింప్ గ్రంథుల్లో నొప్పి, శరీరంపై పుండ్లతో బాధపడుతారు. ఇప్పటికే ఈ వైరస్ సోకిన ఓ వ్యక్తిని చైనా ఉత్తర ప్రాంతంలోని బయన్నుర్ నగర వైద్యులు గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులను, సన్నిహితులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు లెవెల్-3 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఇప్పటికే ఈ వైరస్ చైనాకు ఉత్తర సరిహద్దుకు ఆనుకొని ఉన్న మంగోలియా దేశంలోనూ వేగంగా వ్యాపిస్తోంది. ప్లేగు లోని ఓ రకం వ్యాధిగా దీన్ని గుర్తించారు. బుబోనిక్ ప్లేగుగా దీనికి పేరు పెట్టారు. ఇన్ఫెక్షన్లకు ఎర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా కారణం అని తేల్చారు.మర్మోట్ జాతికి చెందిన ఎలుకలను తిన్న వారికి ఈ వ్యాధి చైనాలో సోకిందని.. అది బాగా వ్యాపిస్తోందని సమాచారం.

    ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ మహమ్మారులు చైనాలోనే వ్యాపించడానికి ప్రధాన కారణం వారి ఆహారపు అలవాట్లే.. కరోనా వైరస్ వ్యాప్తికి గబ్బిలాలు కారణంగా ఓ పరిశోధనలో తేలింది. ఇక ఇప్పుడు చైనాలో ప్రబులుతున్న జీ4 వైరస్ వ్యాప్తికి పందులు వాహకంగా ఉన్నాయి. తాజాగా బయటపడ్డ ‘బుబోనిక్ ప్లేగు’వ్యాధి ‘మర్మోట్ జాతి’ ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపించిందని తేల్చారు. సాధారణంగా ఎలుకలను తినడం చైనీయులకు అలవాటు. ఆ అలవాటే మరో మహమ్మారి ప్లేగు వ్యాప్తికి కారణం అని అనుమానిస్తున్నారు. ఇలా మనుషులను తప్ప అందరినీ తినేస్తున్న క్రూరమైన చైనీయుల ఆహారపు అలవాట్లే ఇప్పుడు ప్రపంచంలో కొత్త వైరస్ ల పుట్టుకకు వ్యాప్తికి.. ఇంతటి వినాశనానికి కారణమవుతోందని శాస్త్రవేత్తలు ఆడిపోసుకుంటున్నారు.

    -నరేశ్ ఎన్నం