https://oktelugu.com/

కాంగ్రెస్ పిచ్చి వ్యూహాలే కొంపముంచుతున్నాయా?

నేషనల్‌ కాంగ్రెస్‌.. ఇప్పుడు ఆ పార్టీ దుస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు కేంద్రంలో మోడీ, అమిత్‌షాల హవానే నడుస్తోంది. మరి అలాంటప్పుడు మహామహులు ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి వ్యూహాలు రచించాలి..? ఇప్పటికే బీజేపీ చేతిలో డక్కీమొక్కీలు తింటున్న కాంగ్రెస్‌ సీనియర్లు ఎంత జాగ్రత్త పడాలి..? కానీ.. కాంగ్రెస్ మాత్రం తప్పుడు నిర్ణయాలతో తనకు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును దూరం చేసుకుంటోంది. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ డొల్లతనం మరోసారి […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 8, 2021 / 10:26 AM IST
    Follow us on


    నేషనల్‌ కాంగ్రెస్‌.. ఇప్పుడు ఆ పార్టీ దుస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు కేంద్రంలో మోడీ, అమిత్‌షాల హవానే నడుస్తోంది. మరి అలాంటప్పుడు మహామహులు ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి వ్యూహాలు రచించాలి..? ఇప్పటికే బీజేపీ చేతిలో డక్కీమొక్కీలు తింటున్న కాంగ్రెస్‌ సీనియర్లు ఎంత జాగ్రత్త పడాలి..? కానీ.. కాంగ్రెస్ మాత్రం తప్పుడు నిర్ణయాలతో తనకు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును దూరం చేసుకుంటోంది. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ డొల్లతనం మరోసారి బయటపడింది. సామాజిక వర్గాలను ఆకట్టుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం పడే అవకాశముంది.

    Also Read: భైంసాలో మళ్లీ అల్లర్లు.. రెండు వర్గాల ఘర్షణ..రిపోర్టర్లకు కత్తిపోట్లు.. బండి సంజయ్ ఫైర్

    గుజరాత్ కొన్ని దశాబ్దాల నుంచి బీజేపీ చేతుల్లోనే ఉంది. మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో అక్కడి ప్రజలు కూడా బీజేపీకే జై కొడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుజారాత్‌లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. ఇది ఒక రకంగా కాంగ్రెస్‌లో ఆత్మవిశ్వాసం నింపింది. గుజరాత్‌లో అధికారంలోకి రాలేకపోయినా మోడీని మూడు చెరువల నీళ్లు తాగించామన్న సంతృప్తి కాంగ్రెస్ నేతలకు దేశ వ్యాప్తంగా మిగిలింది.

    ఆ తర్వాత సరైన నాయకత్వం లేకపోవడంతో వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి వెళ్లిపోతున్నారు. అయినా.. అధినాయకత్వం గుజరాత్ కాంగ్రెస్ పరిస్థితిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఉన్నంత వరకూ కొంత అక్కడ పార్టీని కంట్రోల్‌లో ఉంచేవారు. కానీ.. ఆయన మరణం తర్వాత పార్టీ పూర్తిగా పెద్ద దిక్కు కోల్పోయిందంటున్నారు.

    Also Read: బ్రేకింగ్: టీడీపీ యువనేత మృతి.. టీడీపీలో తీవ్ర విషాదం

    తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ పోటీదారులు కాంగ్రెస్‌కు దూరం కావడానికి ఆ పార్టీ నేతలే కారణమని అంటున్నారు. గుజరాత్‌లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ప్రధానంగా సూరత్‌లో కాంగ్రెస్ కంటే ఆమ్ ఆద్మీపార్టీ ఎక్కువ స్థానాలను సాధించింది. కాంగ్రెస్ ఇక్కడ ఖాతా కూడా తెరవలేకపోయింది. పాటీదారులకు టిక్కెట్లు ఇవ్వకపోవడం వల్లనే ఆ సామాజికవర్గం కాంగ్రెస్‌కు దూరమైంది. ఆమ్ ఆద్మీపార్టీకి పాటీదార్లు చేరువయ్యారు. ఇలా కాంగ్రెస్‌ నేతలకు ముందు చూపు లేకనే అసెంబ్లీ ఎన్నికలు ముందు ఒక బలమైన సామాజికవర్గం మద్దతు కోల్పోయారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తన పనితీరు మార్చుకోకుంటే గుజరాత్‌లో మరో పార్టీ రెండో స్థానంలోకి వచ్చే అవకాశాలే ఉన్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్