వైఎస్ షర్మిలకు జగన్ అన్యాయంపై పోసాని సంచలన వ్యాఖ్యలు

ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ కు ఇప్పుడు చెల్లెలు వైఎస్ షర్మిల వ్యవహారం రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పంటికింద రాయిలా మారింది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ కు కూడా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఇష్టం లేదని స్వయంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం అప్పట్లోనే స్పష్టం చేశారు. పక్కరాష్ట్రం తెలంగాణతో రాజకీయంగా, ప్రభుత్వ పరంగా ఉన్న అనుబంధం దృష్ట్యా కేసీఆర్ తో మితృత్వం కారణంగానే షర్మిల పార్టీ పెట్టడం జగన్ […]

Written By: NARESH, Updated On : March 8, 2021 10:24 am
Follow us on

ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ కు ఇప్పుడు చెల్లెలు వైఎస్ షర్మిల వ్యవహారం రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పంటికింద రాయిలా మారింది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ కు కూడా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఇష్టం లేదని స్వయంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం అప్పట్లోనే స్పష్టం చేశారు. పక్కరాష్ట్రం తెలంగాణతో రాజకీయంగా, ప్రభుత్వ పరంగా ఉన్న అనుబంధం దృష్ట్యా కేసీఆర్ తో మితృత్వం కారణంగానే షర్మిల పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదని సజ్జల తెలిపారు.

అయితే అన్న జగన్ మాట వినకుండా షర్మిల ముందుకెళుతోందని సజ్జల మాటలను బట్టి అర్థమవుతోంది. తెలంగాణ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్న షర్మిల ఈ నెలలోనే ఖమ్మంలో తన పార్టీ పేరును ప్రకటించబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఇక వైఎస్ షర్మిలకు జగన్ అన్యాయం చేశారని.. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపించిన షర్మిలకు కనీసం ఒక పదవి ఇవ్వలేదని.. ఆమెను రాజకీయంగా వాడుకొని వదిలేశాడన్న విమర్శలు వచ్చాయి. షర్మిలకు జగన్ అన్యాయం చేశారన్న ఆరోపణలపై తాజాగా ప్రముఖ టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు.

షర్మిలకు జగన్ ఎటువంటి అన్యాయం చేయలేదని పోసాని కృష్ణమురళి చెప్పారు. చేసి ఉంటే ఏపీలోనే షర్మిల పోటీకి వచ్చేవారు కదా అని ప్రశ్నించారు. షర్మిల ఎదగాలనే తెలంగాణలో పార్టీ పెడుతున్నారని.. అయితే అందులో తప్పేంటని పోసాని ప్రశ్నించారు. షర్మిల రాకను స్వాగతిస్తున్నట్టు పోసాని తెలిపారు.