రాజకీయాల్లో మెతక వైఖరితో ఉంటే ప్రతిపక్షాలకు, అపోజిషన్ పార్టీలకు అలుసైపోతాం. అందుకే.. రాజకీయాల్లో దూకుడుగా ఉండే స్వభావాన్ని ఎంచుకోవాలి. అదే పంథాలో ముందుకు సాగిపోవాలి. గతంలో వైఎస్సార్ కూడా తన పాలనలో ఇరు పక్షాలకు అదే రుచిచూపించారు. అందుకే.. దానికి పది రెట్లు జగన్ ఇప్పుడు జోరు చేస్తున్నారు. జగన్ మార్క్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు. వీటిని తట్టుకోవడం ఏపీలోని విపక్షాలకు సాధ్యం కావడంలేదు. చంద్రబాబు ఇంకా ఔట్ డేటెడ్ రాజకీయాలనే ఫాలో అవుతున్నారు.
Also Read: కాంగ్రెస్ పిచ్చి వ్యూహాలే కొంపముంచుతున్నాయా?
కాలంతో పోటీ పడి ఆయన అప్ డేట్ కావడంలేదని సొంత పార్టీలోనే కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. జగన్ ఫ్రాక్షనిస్ట్ అని చాలా సార్లు రికార్డ్ అరగదీసిన చంద్రబాబు నేరగాడు అంటూ కొత్తగా విమర్శిస్తున్నారు. సరే ఎవరు ఏంటి అన్నది జనాలకు తెలిసే ఓటు చేశారు. బాబు అవునన్నా కాదన్నా జగన్ సీఎం. ఈ విషయం ఒప్పుకుని తీరాల్సిందే. మరోవైపు చూసుకుంటే ఇప్పటికి రెండు ఎన్నికలు జరిగాయి. 2019లో జరిగిన సాధారాణ ఎన్నికల్లో వైసీపీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. తాజాగా.. జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీనే విజయ ఢంకా మోగించింది. అయినా.. బాబు తాను ఓడిపోలేదని చెప్పడం ఎంతో విడ్డూరం.
బాబు ఇలా మాట్లాడుతుండడం తమ్ముళ్లకు కూడా నచ్చడం లేదట. ఇదిలా ఉండగా.. అటు మున్సిపల్ ఎన్నికలు సైతం రానే వచ్చాయి. విశాఖ అంటే వైసీపీకి ఎంతో మోజు. దాంతో విశాఖ మేయర్ తామే గెలుచుకోవాలని వైసీపీ చాలా పెద్ద ప్లాన్‌తోనే ఉంది. కానీ.. వాటికి పై ఎత్తులు వేసేందుకు చంద్రబాబు కిందా మీదా పడుతున్నారు. రాజధాని విషయంలో గవే పాత మాటలనే వల్లిస్తున్నారు. ఆర్థిక రాజధాని అంటూ పాత చింతకాయ కబుర్లే చెబుతున్నారు. అసలైన రాజధాని విశాఖకు వచ్చేస్తుంటే ఇంకా విశేషణాలతో కూడిన రాజధానులు ఎందుకు బాబూ అని తమ్ముళ్లే అంటున్నారుట. బాబు మాటల్లోని డొల్లతనాన్ని తమకు అనువుగా మార్చుకుని విశాఖలో పాగా వేసేందుకు జగన్ భారీ ప్లాన్ తో రెడీ అవుతున్నారు.
Also Read: వైఎస్ షర్మిలకు జగన్ అన్యాయంపై పోసాని సంచలన వ్యాఖ్యలు
మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా విశాఖ కార్పొరేషన్‌ను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విశాఖ కార్పొరేషన్ లో 98 వార్డులు ఉన్నాయి. ఇందులో వైసీపీ 75 వార్డుల్లో కచ్చితంగా గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ మేరకు పార్టీకి అధినాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చేశాయి. దాని కోసం వైసీపీ ఎంత దూరమైనా వెళ్లడానికైనా రెడీ అవుతోంది. ఇక టీడీపీ బడా నేతలను కూడా తమ వైపునకు లాగేయడానికి వైసీపీ స్కెచ్ తో సిధ్ధంగా ఉంది. ఎన్నాళ్లుగానో పార్టీని నమ్ముకుని ఉన్న వారు సైతం జీవీఎంసీ ఎన్నికల వేళ వైసీపీలోకి క్యూ కడుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విశాఖ కార్పొరేషన్ ఎన్నికలలో ఏకగ్రీవాలకు శ్రీకారం చుడతామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొస్తున్నారు. మరి వీటన్నింటి నేపథ్యంలో టీడీపీని వాష్ అవుట్ చేసే భారీ స్కెచ్ వైసీపీ వేసినట్లుగా అర్థమవుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్