India Population: భారత దేశంలో జనాభా పెరుగుతోంది. ప్రస్తుతం 141 కోట్ల జనాభాగా ఉన్న 2047 వరకు దాదాపు 160 కోట్లకు చేరనుంది. దీంతో జనాభా పెరుగుదలతో లాభాలతోపాటు నష్టాలు కూడా రానున్నాయి. పెరుగుతున్న జనాభాకనుగుణంగా వనరులు తీసుకురావడం వీలు కాదు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. దీంతో అవకాశాలు లేక యువత నిర్వీర్యమైపోతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అనేక నష్టాలు మనల్ని చుట్టుముడతాయి. మనకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే కేవలం జనాభా పెరుగుదలతో శక్తి ఉన్నా చేయడానికి పని మాత్రం దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో జనాభా వృద్ధితో మనదేశం అనేక అవస్థల పాలు కానుందని తెలుస్తోంది.
అయితే 2100 సంవత్సరం తరువాత జనాభా వృద్ధిలో ఘననీయమైన మార్పు రానుంది. ఎందుకంటే అప్పటి పరిస్థితుల వల్ల గర్భధారణ సమస్యలు ఎక్కువవుతాయని తెలుస్తోంది. దీంతో జనాభా పెరుగుదల తగ్గిపోతుంది. దీంతో జనాభా ఏకంగా 41 కోట్లు తగ్గి 100.2 కోట్లకు రానుంది. దీంతో మనుషుల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ కారణంగానే దేశంలో జనాభా సగానికి పైగా తగ్గుతుందని ఓ అంచనా. ప్రస్తుతం గర్భధారణ రేటు 2.1 గా ఉన్నా భవిష్యత్ లో అది 1.8 గా మారనుంది. దీంతో జనాభా పెరుగుదలపై భారం పడుతుందని తెలుస్తోంది.
జనాభా తగ్గడానికి అనేక కారణాలు కనిపించనున్నాయి. వివాహ వయసు ఆలస్యం కావడం, గర్భధారణ వ్యవధి పెరిగిపోవడం వంటి వాటి వల్ల జనాభా పెరుగుదల తగ్గనుందని తెలుస్తోంది. దీంతో భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. భవిష్యత్ పై బెంగతో వివాహం చేసుకునేందుకు యువత ముందుకు రావడం లేదు. ఫలితంగానే సంతానోత్పత్తిపై పెను ప్రభావం చూపనుంది. అందుకే జనాభా 2100 తరువాత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
జనాభా పెరగడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. నిరుద్యోగం పెరుగుతుంది. వనరులు తగ్గుతాయి. ఆహార పదార్థాల కొరత వేధిస్తుంది. ఫలితంగా దారిద్ర్యం తాండవిస్తుంది. అందుకే జనాభా పెరుగుదలను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2047 తరువాత మన దేశం చైనా కంటే ఎక్కువ జనాభా గల దేశంగా మారే అవకాశముంది. తరువాత స్థానంలో నైజీరియా, మూడో స్థానంలో చైనా ఉండనున్నాయి. దీంతో జనాభా పెరుగుదలను అడ్డుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇప్పటికే జనాభా నియంత్రణలో దేశం బాగా అభివృద్ధి సాధించినా ఇంకా జనాభాను నియంత్రించాల్సిన పరిస్థితి ఆసన్నమైందని గుర్తుంచుకోవాలి.
Also Read:Governor Tamilisai: ఆకాశంలోనూ గవర్నర్ చేసిన మంచి పని ఏంటో తెలుసా?