Condom Addiction: కర్ణుని చావుకు సవాలక్ష కారణాలంటారు. మనుషుల్లో కూడా మత్తు కోసం అనేక మార్గాలు వెతుకుతున్నారు. ఇందులో ప్రముఖ పాత్ర వహించేవి అల్కాహాల్, గంజాయి, హెరాయిన్ వంటివి ఉన్నా ఇంకా ఏదో కొత్తదనం కోసం యువత పరుగులు పెడుతూనే ఉంది. పుర్రెకో గుణం.. జిహ్వకో రుచి అన్న చందంగా పలు రకాల వెరైటీల కోసం అర్రులు చాస్తుంటారు. ఏదైనా విషయం తెలిస్తే దాన్ని పాటించాలని ఉవ్విళ్లూరుతుంటారు. కొత్తదనం కోసమే నిత్యం ఆరాటపడుతుంటారు. ఇక్కడ కూడా కొంతమంది యువత తమ మత్తు కోసం ఇతర మార్గాలు వెతుక్కుంటున్నారు.
తాజాగా పశ్చిమ బెంగాల్ లోని యువత కండోమ్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కానీ అందుకు కాదట. వాటిని వేరే విధంగా ఉపయోగిస్తున్నారు. దీంతో యువత పెద్దమొత్తంలో నిరోధ్ లు కొనడంతో మెడికల్ షాపుల్లో కొరత ఏర్పడుతోంది. అసలు ఎందుకు కొనుగోలు చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఏదైనా విషయం తెలిస్తే దాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించడం మనకు అలవాటే. అందులో భాగంగానే నిరోధ్ లతో కూడా కొత్తగా ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: India Population: 41 కోట్ల కోత.. దారుణంగా పడిపోనున్న భారత జనాభా
అసలు వాటితో ఏం చేస్తున్నారంటే తెలిస్తే పరేషానే. అతిశయోక్తికి గురికావడం ఖాయమే. బెంగాల్ లోని దుర్గాపూర్ గ్రామంలో యువత మెడికల్ షాపుల్లోని నిరోధ్ ప్యాకెట్లు కొనుగోలు చేస్తున్నారు. వీటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి తెల్లవారి నిరోధ్ ను తీసేసి ఆ నీటిని తాగుతున్నారు. దీంతో కిక్కు బాగా ఎక్కుతుందట. అచ్చం మందుబాబుల్లా తూలుతున్నారు. ఇదేదో బాగుందని అందరు నిరోధ్ ప్యాకెట్లు తెచ్చుకుని అదే తీరుగా ప్రయోగాలు చేస్తూ ఒకరిని మించి మరొకరు ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో అక్కడ కండోమ్ ల కొరత ఏర్పడుతోంది.
కండోమ్స్ ను ఎక్కువ సేపు నీటిలో నానబెట్టడం వల్ల ఆర్గానిక్ మాలిక్యుల్స్ బద్దలై అల్కహాలిక్ కాంపౌండ్స్ గా మారతాయని చెబుతున్నారు. దీంతోనే వారికి అల్కహాల్ తీసుకున్నట్లు పూనకం వస్తోంది. కాలేజీ స్టూడెంట్స్ ఇలాంటి అలవాట్లకు బానిసలు కావడం ఆందోళన కలిగిస్తోంది. వారి భవిష్యత్ ఏమిటన్నది సందిగ్దంగానే మారుతోంది. దీనిపై స్థానిక అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. యువత ఇలా పెడదారి పడితే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి యువతను సక్రమ మార్గంలో పెట్టేందుకు కావాల్సిన మార్గాలు అన్వేషిస్తున్నారు.