ఇంటి నుండి బైటకు రామంటున్న భారతీయులు!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పూర్తిగా కట్టడి కాకుండా లాక్ డౌన్ ఎత్తివేయడానికి ప్రభుత్వాలు సందేహిస్తున్నాయి. మరోవంక ఇంకెత కాలం లాక్ డౌన్ అంటూ ప్రజలలో అసహనం వ్యక్తం అవుతున్నది. లాక్ డౌన్ ఎత్తివేయమని అనేక దేశాలలో ఆందోళనలు జరుగుతున్నాయి. పాక్ చరిత్రలో తొలిసారి హిందూ పైలట్ నియామకం అయితే మరికొంతకాలం ఇంటికే పరిమితం అవుతాం అని భారతీయులు స్ఫష్టం చేస్తున్నారు. ఈ విషయంలో భారతీయులతో ఏకీభవిస్తున్నది జపాన్ వారు మాత్రమే కావడం గమనార్హం. కరోనా వైరస్ అదుపులోకి […]

Written By: Neelambaram, Updated On : May 5, 2020 3:25 pm
Follow us on


ప్రపంచ వ్యాప్తంగా కరోనా పూర్తిగా కట్టడి కాకుండా లాక్ డౌన్ ఎత్తివేయడానికి ప్రభుత్వాలు సందేహిస్తున్నాయి. మరోవంక ఇంకెత కాలం లాక్ డౌన్ అంటూ ప్రజలలో అసహనం వ్యక్తం అవుతున్నది. లాక్ డౌన్ ఎత్తివేయమని అనేక దేశాలలో ఆందోళనలు జరుగుతున్నాయి.

పాక్ చరిత్రలో తొలిసారి హిందూ పైలట్ నియామకం

అయితే మరికొంతకాలం ఇంటికే పరిమితం అవుతాం అని భారతీయులు స్ఫష్టం చేస్తున్నారు. ఈ విషయంలో భారతీయులతో ఏకీభవిస్తున్నది జపాన్ వారు మాత్రమే కావడం గమనార్హం. కరోనా వైరస్ అదుపులోకి రావడమో, చికిత్సలు పూర్తి కావడమో జరిగే లోపే లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలనే మాట అంతకంతకూ బలంగా వినిపిస్తున్న సమయంలో భారతీయుల ధోరణి మరో విధంగా వ్యక్తం అవుతున్నది.

14 దేశాల్లో ఇప్సోస్ జరిపిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. కోవిడ్ ఇంకా అదుపులోకి రాకపోయినా ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాలని భారత్, చైనా, ఇటలీ రష్యా దేశాల్లోని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని ఆ సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో ఈ నాలుగు దేశాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు మాత్రం జంకుతున్నారట.

చిత్రసీమలో వరుస విషాదాలు.. ప్రముఖ డైరెక్టర్ మృతి

మరీ ముఖ్యంగా భారత్‌లో 82 శాతం, జపాన్‌లో 72 శాతం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. అంటే లాక్‌డౌన్ ఎత్తివేసినా పనిలోకి వచ్చేందుకు మనుషులు దొరుకక పోవచ్చని అంటున్నారు.

మరోవైపు జర్మనీ, ఇటలీ ప్రజలు వీధుల్లోకి అడుగు పెట్టేందుకు ఏమాత్రం ఆందోళన పడడం లేదట. ఎలాంటి సంకోచం లేకుండా వీధుల్లోకి వచ్చేందుకు వారు ఉత్సాహం చూపిస్తున్నారు. తీవ్రస్థాయిలో కరోనాకు గురికావడం వల్ల వారిలో ఆ ధోరణి వచ్చిందా అనేది తెలియదు.