
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ,వార్డు సచివాలయాలకు వేసిన రంగులు మార్చడం పై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. వైసీపీ రంగులు మార్చకుండానే జగన్ సర్కార్ మరో కొత్త రంగును ఆ రంగులకు యాడ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించింది.
గతంలో కూడా వైసీపీ జెండా రంగులను వెంటనే తొలగించాలని ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలలోపు రంగులను మార్చాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఆ భవనాలకు వేశారని ఆరోపిస్తూ వచ్చిన పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇస్తూ రంగులు మార్చాలని సూచిచింది. దానిపై ప్రభుత్వం మరో జిఓ ఇచ్చి రంగులలో కొన్ని మార్పులు చేసింది. అయితే వైసిపి రంగులు ఉన్నాయన్నది ఆరోపణగా ఉంది. దీనికి సంబందించి ప్రభుత్వం విడుదల చేసిన జిఓను ఇప్పుడు హైకోర్టు మరోసారి సస్పెండ్ చేసి, తదుపరి విచారణను వాయిదా వేసింది.ఏ ప్రాతిపదికన ఈ రంగులు వేశారో వివరణ ఇవ్వాలని, అది సరిగా లేకపోతే కోర్టు దిక్కారం ఎదుర్కోవలసి వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.