https://oktelugu.com/

వైన్ షాపులో ఉపాధ్యాయుల డ్యూటీపై పవన్ సీరియస్!

భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పించే గురువులకు వైన్ షాపుల దగ్గర విధులు పురమాయించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఉపాధ్యాయులకు ఇవేం విధులని ప్రశ్నించారు. ఆయన చిత్తూరు జిల్లా నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ఎవరెవరికి ఎటువంటి బాధ్యతలు అప్పగించాలో తెలియని జగన్ సర్కార్ పై పవన్ అసహనం వ్యక్తం చేశారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకో, పేదలకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయడం వంటి వాటిని పర్యవేక్షించేందుకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 5, 2020 4:42 pm
    Follow us on

    భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పించే గురువులకు వైన్ షాపుల దగ్గర విధులు పురమాయించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఉపాధ్యాయులకు ఇవేం విధులని ప్రశ్నించారు. ఆయన చిత్తూరు జిల్లా నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ఎవరెవరికి ఎటువంటి బాధ్యతలు అప్పగించాలో తెలియని జగన్ సర్కార్ పై పవన్ అసహనం వ్యక్తం చేశారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకో, పేదలకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయడం వంటి వాటిని పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులు ఉపయోగించుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆలయాలు, మసీదులు, చర్చీలకు వెళ్లకుండా.. పండుగలు చేసుకోకుండా నియబద్ధంగా ఉంటే.. ప్రభుత్వం మాత్రం మద్యం దుకాణాలు తెరవడం ద్వారా ఇంతకాలం పాటించిన లాక్ డౌన్ నియమాలను, ఆ స్ఫూర్తిని మంటగలిపిందని పవన్‌ వ్యాఖ్యానించారు.

    లాక్‌ డౌన్‌ సడలింపుల కారణంగా జగన్ ప్రభుత్వం చేపట్టిన మద్యం అమ్మకాల కోసం ఆయా దుకాణాల వద్ద ఉపాధ్యాయులను ఉంచడం శోచనీయమని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తంచేశారు.