https://oktelugu.com/

కేసులు పెరుగుతున్నాయ్ కానీ.. ఈ శుభవార్త విన్నారా?

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే కరోనాతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్ర ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో యాక్టివ్ కేసుల కంటే రికవరీ రేటు రెండింతలు పెరిగింది. గత 24 గంటల్లో దాదాపు 18 వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,53,750కు పెరిగింది. దేశవ్యాప్తంగా శనివారం నాటికి 2,95,058 కేసులు యాక్టివ్‌ గా ఉన్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 18, 2020 / 08:53 PM IST
    Follow us on

    దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే కరోనాతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్ర ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో యాక్టివ్ కేసుల కంటే రికవరీ రేటు రెండింతలు పెరిగింది. గత 24 గంటల్లో దాదాపు 18 వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,53,750కు పెరిగింది. దేశవ్యాప్తంగా శనివారం నాటికి 2,95,058 కేసులు యాక్టివ్‌ గా ఉన్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని యాక్టివ్ కేసుల్లోనూ ఆసుపత్రులలో, హోం ఐసోలేషన్‌ లో ఉన్న వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది.

    గత 24 గంటల్లో 17,994 మంది రోగులు కోలుకున్నారని, రికవరీ రేటు 63 శాతంగా ఉన్నట్టు తెలిపింది. అలాగే, ఇప్పటి వరకు 1,34,33,742 స్వాబ్ శాంపిళ్లు పరీక్షించగా వీటిలో 3,61,024 శాంపిళ్లు శుక్రవారం ఒక్క రోజే పరీక్షించినట్టుమ తెలిపింది. అంటే పరీక్షల సంఖ్య మిలియన్‌ కు 9,734.6కు పెరిగినట్టు వివరించింది. బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం, ఒడిశాలలో రోజు వారీ కేసులు పెరుగుతున్నట్టు పేర్కొన్న కేంద్రం వైరస్ వ్యాప్తికి, మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాని కోరింది.