https://oktelugu.com/

నా బయోపిక్‌లో నేనే నటిస్తా అంటున్న స్టార్ విలన్‌

తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో అనేక సినిమాలు చేసిన విలక్షన నటుడు సోనూ సూద్‌. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా ఆయన ప్రేక్షకులకు చేరువయ్యాడు. తెరపై విలన్‌ అయినా నిజ జీవితంలో ఆయన అసలైన హీరో. లాక్‌డౌన్‌ టైమ్‌లో ఆయనలోని మంచి మనిషి, హీరోను దేశం మొత్తం చూసింది. కరోనాను కంట్రోల్‌ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో చిక్కుకున్న వలస కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసింతే. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 18, 2020 / 08:34 PM IST
    Follow us on


    తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో అనేక సినిమాలు చేసిన విలక్షన నటుడు సోనూ సూద్‌. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా ఆయన ప్రేక్షకులకు చేరువయ్యాడు. తెరపై విలన్‌ అయినా నిజ జీవితంలో ఆయన అసలైన హీరో. లాక్‌డౌన్‌ టైమ్‌లో ఆయనలోని మంచి మనిషి, హీరోను దేశం మొత్తం చూసింది. కరోనాను కంట్రోల్‌ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో చిక్కుకున్న వలస కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసింతే. అలాంటి వలస కార్మికుల పాటిన సోనూ సూద్‌ హీరో అయ్యాడు. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలసజీవులను సోనూ సూద్ తన సొంత ఖర్చులతో వారి స్వస్థలాలకు తరలించాడు. ఖర్చుకు వెనుకాడకుండా వేలమందిని వారి ఇళ్లకు చేర్చి, వారి ముఖాల్లో, కుటుంబాల్లో ఆనందం నింపాడు. మరెందరికో ఆహారం, వసతి కల్పించి నిజమైన హీరో అనిపించుకున్నాడు.

    ‘విరూపాక్ష’ కాదట.. ‘గజదొంగ’ లేదంటే ‘బందిపోటు’!

    లాక్‌డౌన్‌ అనుభవాలతో ఓ పుస్తకం రాస్తానని సోనూ సూద్‌ ఇటీవల వెల్లడించాడు. తాను కళ్లతో చూసిన శ్రమ జీవుల కష్టానికి అక్షర రూపం ఇస్తానని తెలిపాడు. మరోవైపు కార్మికులకు సాయం చేసి దేశ వ్యాప్తంగా ఎంతో మంది మన్ననలు అందుకున్న సోనూ సూద్‌ జీవితం ఆధారంగా బయోపిక్‌ తీయాలని బాలీవుడ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంజాబ్‌లోని మోగా అనే మారుమూల ప్రాంతం నుంచి రైలులో ఒక్కడే ముంబైకి వచ్చి ఎన్నో కష్టాలకు ఓర్చి ఇంత పెద్ద నటుడిగా ఎదిగిన తీరును వెండితెరపై చూపిస్తే సూపర్హిట్‌ అవుతుందని ఫిలిం మేకర్స్‌ భావిస్తున్నారు. ఈ విషయం సోనూ సూద్‌ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన అతను ఎవరైనా తన బయోపిక్ తీస్తే అందులో హీరో పాత్రను తానే పోషిస్తానని స్పష్టం చేశాడు. తన జీవితంలోని ఎత్తుపల్లాలు, ఎదురైన అనుభవాలు తనకంటే బాగా ఇతరులకు తెలియవని చెప్పాడు. తన బయోపిక్‌లో తానే నటిస్తే.. ఈ ఘనత సాధించిన నటుడిగా సోనూ ఓ రికార్డు క్రియేట్‌ చేయనున్నాడు.