https://oktelugu.com/

బీసీలకే ప్రాధాన్యం ఇస్తే.. బీసీ ఓట్లు ఎందుకు పడలే బాబు గారూ..!

తెలుగుదేశం పార్టీకి ముందు నుంచీ బీసీలే వెన్నుముక. ఇటు పార్టీలోనూ.. అటు ఇతరత్రా పదవుల్లోనూ వారిదే సింహభాగం. అయితే.. అదంతా ఎన్టీఆర్‌‌ హయాంలో జరిగిందనేది చాలా మంది అభిప్రాయం. ఎప్పుడైతే చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టారో బీసీలకు ప్రాధాన్యం తగ్గిందనేది టాక్‌. అయితే.. తమ పార్టీ బీసీలకు ప్రాధాన్యం ఇస్తుందని నిత్యం చంద్రబాబు చెబుతుంటారు. కానీ.. ఆయన కనుక బీసీలకు ఇంపార్టెన్స్‌ ఇస్తే నేడు స్థానిక ఓట్లలో వైసీపీకి బీసీ వర్గం ఓట్లు ఎందుకు పడ్డాయనేది మిలియన్‌ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 19, 2021 / 11:54 AM IST
    Follow us on


    తెలుగుదేశం పార్టీకి ముందు నుంచీ బీసీలే వెన్నుముక. ఇటు పార్టీలోనూ.. అటు ఇతరత్రా పదవుల్లోనూ వారిదే సింహభాగం. అయితే.. అదంతా ఎన్టీఆర్‌‌ హయాంలో జరిగిందనేది చాలా మంది అభిప్రాయం. ఎప్పుడైతే చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టారో బీసీలకు ప్రాధాన్యం తగ్గిందనేది టాక్‌. అయితే.. తమ పార్టీ బీసీలకు ప్రాధాన్యం ఇస్తుందని నిత్యం చంద్రబాబు చెబుతుంటారు. కానీ.. ఆయన కనుక బీసీలకు ఇంపార్టెన్స్‌ ఇస్తే నేడు స్థానిక ఓట్లలో వైసీపీకి బీసీ వర్గం ఓట్లు ఎందుకు పడ్డాయనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

    బీసీలు అంటే.. కొత్తగా ఎవరినైనా తీసుకువచ్చి పదవులు ఇచ్చారా..? లేక ఏళ్ల తరబడి టీడీపీలోనే ఉంటూ.. పలుమార్లు పరాజయాలు చవిచూసిన వారికి.. పలుమార్లు పార్టీ నుంచి బయటకు లోపలికి తిరిగిన వారికి పదవులు ఇచ్చారా? అంటే.. రెండోదే కరెక్ట్ అని అంటున్నారు పరిశీలకులు. దీనివల్ల.. క్షేత్రస్థాయిలో కొత్తగా బీసీ నాయకత్వం టీడీపీకి చేరువ కాలేదు. ఉన్నవారే పదవులు చేపట్టడం.. ఉన్నవారికే ప్రాధాన్యం ఉండడం.. వారు కూడా ప్రజలకు చేరువ కాలేకపోవడం.. వంటివి బీసీ మంత్రం వికటించేలా చేసింది. పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నుంచి ఈ వర్గం ఎక్కువగానే ఆశిస్తోంది.

    ఈ నేపథ్యంలో బీసీలకు అనుకూలంగా క్షేత్రస్థాయిలో కొత్త వారిని బలోపేతం చేయడం సహా.. పదవుల విషయంలోనూ జాగ్రత్తలు పాటించి.. విఫలమైన నాయకత్వాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక వైసీపీ విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో అంటే 2019లోనే ఎంతో మంది పాత నేతలు ఉన్నప్పటికీ ఇదే బీసీ సామాజిక వర్గానికి చెందిన కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చారు. అప్పటి వరకు బేల్ దారి మేస్త్రీలుగా ఉన్నవారికి ఇతర చేతి వృత్తుల్లో ఉన్న వారికి రాజకీయంగా ప్రాధాన్యం పెంచారు.

    ఇది కాస్త రాజకీయంగా వైసీపీకి మైలేజీ తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు జరిగిన స్థానిక సమరంలోనూ జగన్ ఇదే ఫార్ములా ఎంచుకున్నారు.. సీనియర్లను.. జంపింగులను పక్కన పెట్టిమరీ.. కొత్త ముఖాలకు మేయర్లుగా చైర్మన్లుగా చైర్ పర్సన్లుగా అవకాశం కల్పించారు. ఇది.. బీసీ సామాజిక వర్గంలో వైసీపీకి భరోసా పెంచుతోంది. అందుకే ఇంత భారీ స్థాయిలో స్థానిక విజయాన్ని నమోదు చేయగలిగింది. మరి ఈ తరహాలో వెళ్లాల్సిన అవసరం టీడీపీకి కూడా ఉంది.