జగన్ సాహసం: కుర్చీలన్నీ కొత్త వారు… బీసీలకే..

ఏపీలో కార్పొరేషన్‌, మున్సిపాలిటీలకు ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. దీంతో కొత్త మేయర్లు, చైర్మన్లు, చైర్‌‌పర్సన్లు కొలువుదీరారు. అయితే.. ఒక్కటి మినహా మిగితా అన్ని స్థానాల్లోనూ వైసీపీ హవానే నడిచింది. కేవలం ఒక్క మున్సిపాలిటీపైనే టీడీపీ జెండా ఎగిరింది. ఈ క్రమంలో వైసీపీ అధినేత కొత్త మొఖాలకే ఛాన్స్‌ ఇచ్చారు. Also Read: తిరుపతి ఉప ఎన్నికల్లో బలాబలాలు.. పవన్ ప్రయాణం ఎటు? మొత్తం 11 కార్పొరేషన్లు ఉండగా.. వాటిలో 10 కార్పొరేషన్లకు పూర్తిగా కొత్త […]

Written By: Srinivas, Updated On : March 19, 2021 11:30 am
Follow us on


ఏపీలో కార్పొరేషన్‌, మున్సిపాలిటీలకు ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. దీంతో కొత్త మేయర్లు, చైర్మన్లు, చైర్‌‌పర్సన్లు కొలువుదీరారు. అయితే.. ఒక్కటి మినహా మిగితా అన్ని స్థానాల్లోనూ వైసీపీ హవానే నడిచింది. కేవలం ఒక్క మున్సిపాలిటీపైనే టీడీపీ జెండా ఎగిరింది. ఈ క్రమంలో వైసీపీ అధినేత కొత్త మొఖాలకే ఛాన్స్‌ ఇచ్చారు.

Also Read: తిరుపతి ఉప ఎన్నికల్లో బలాబలాలు.. పవన్ ప్రయాణం ఎటు?

మొత్తం 11 కార్పొరేషన్లు ఉండగా.. వాటిలో 10 కార్పొరేషన్లకు పూర్తిగా కొత్త వారే మేయర్లు ఎన్నికయ్యారు. కడపలో సురేశ్‌ బాబు ఒక్కరే వరుసగా రెండోసారి మేయర్‌‌ పదవి చేపట్టారు. మిగిలిన పది మందికీ ఈ పదవి దక్కడం ఇదే తొలిసారి. వీరిలో కర్నూల్‌ మేయర్‌‌ రామయ్య గతంలో జడ్పీటీసీ సభ్యునిగా.. జిల్లా పరిషత్తుల్లో ఫ్లోర్‌‌ లీడర్‌‌గా చేయడంతోపాటు రాజకీయాల్లోనూ అనుభవం ఉంది. ఒంగోలు మేయర్‌‌ సుజాత ప్రభుత్వ టీచర్‌‌. 2009లో ఆమె ఆ ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించారు. కొండపి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. ప్రస్తుతం వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా ఉంటూ ఒంగోలు నగరపాలక సంస్థ తొలి మేయర్‌‌గా పదవి చేపట్టారు.

గుంటూరు మేయర్‌‌ మనోహర్‌‌ నాయుడు కూడా గతంలో కార్పొరేటర్‌‌గా చేశారు. ఇపుడు తొలిసారి మేయర్‌‌ పదవి చేపట్టారు. విజయవాడ మేయర్‌‌ భాగ్యలక్ష్మి గతంలో ఒకసారి కాంగ్రెస్‌ తరఫున కార్పొరేటర్‌‌గా పోటీ చేసి ఓడారు. ఇప్పుడు వైసీపీ తరఫున మేయర్‌‌ అయ్యారు. మిగిలిన వారంతో రాజకీయాలకు దాదాపు కొత్తవారే. అనంతపురం మేయర్‌‌ వసీం తొలిసారి కార్పొరేటర్‌‌గా గెలిచి ఈ పదవిని చేపట్టారు. వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేకపోయినా ఎమ్మెల్యే ప్రోత్సాహంతో వసీం పోటీచేసి గెలిచినట్లు సమాచారం.

చిత్తూరు మేయర్‌‌ అముద ఒంటరితో జీవనం సాగిస్తున్నారు. పదో తరగతి వరకు చదువుకున్న ఆమె ఇంటి వద్ద పిల్లలకు ట్యూషన్లు చెబుతూ.. టైలరింగ్‌ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అముద సోదరుడు ఆమె ఇంటి పక్కనే నివాసం ఉంటూ మద్దతుగా ఉంటారు. విజయనగరం మేయర్‌‌ విజయలక్ష్మి గృహిణి. ఆమె భర్త స్థానిక ఎమ్మెల్యే కంపెనీలో ఉద్యోగి. స్థానిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమెకు మేయర్‌‌ పదవి దక్కింది. విశాఖపట్నంలో హరివెంకట కుమారికి అనుకోకుండా మేయర్‌‌గా అవకాశం దక్కింది. మొదట్నుంచీ మేయర్‌‌ పదవి వైసీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణకు ఇస్తారని ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో వంశీ స్థానంలో హరి వెంకటకుమారికి అవకాశం లభించింది. ఆమె గృహిణి కాగా.. ఆమె భర్త వైసీపీలో వార్డు అధ్యక్షుడు.

Also Read: తమిళనాడులో తెలుగోళ్ల ఓటు ఎటు?

తిరుపతి మేయర్‌‌ శిరీష కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. శిరీష, ఆమె భర్త తిరుపతిలో వైద్యులుగా ప్రైవేటు ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మద్దతుతో శిరీష తొలిసారి కార్పొరేటర్‌‌గా పోటీ చస్త్రశారు. మచిలీపట్నం మేయర్‌‌ వెంకటేశ్వరమ్మ గృహిణి. ఆమె భర్త మోకా భాస్కరరావు వైకాపాలో ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉంటూ గతేడాది హత్యకు గురయ్యారు. ఇప్పుడు వెంకటేశ్వరమ్మ కార్పొరేటరుగా గెలిచి మేయర్‌‌ అయ్యారు.

జనరల్‌కు కేటాయించిన స్థానాల్లో నాలుగుచోట్ల బీసీలకు అవకాశం ఇచ్చారు. విజయవాడ, మచిలీపట్నం, తిరుపతి జనరల్‌ మహిళలకు రిజర్వు చేయగా వీటిని బీసీ మహిళలకు కేటాయించారు. అనంతపురం జనరల్‌కు రిజర్వు చేయగా.. అక్కడ మైనార్టీ వ్యక్తికి పదవి ఇచ్చారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్