సూర్య, సిరాజ్‌ ఇన్.. బుమ్రా ఔట్‌.. ఇంగ్లండ్‌ సిరీస్‌కు భారత్‌ జట్టు ప్రకటన

ఇంగ్లండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన జంబో జట్టు వివరాలను శుక్రవారం వెల్లడించింది. అంతా ఊహించినట్లే స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఇటీవలే అతను స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గోవా వేదికగా అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం నిరాడంబరంగా సాగింది. ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్న బుమ్రా.. వన్డే సిరీస్ […]

Written By: Srinivas, Updated On : March 19, 2021 12:03 pm
Follow us on


ఇంగ్లండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన జంబో జట్టు వివరాలను శుక్రవారం వెల్లడించింది. అంతా ఊహించినట్లే స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఇటీవలే అతను స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గోవా వేదికగా అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం నిరాడంబరంగా సాగింది. ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్న బుమ్రా.. వన్డే సిరీస్ నుంచి కూడా విశ్రాంతి కోరినట్లు తెలుస్తోంది.

ఇక నాలుగో టీ20లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ వన్డే జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చిన మహ్మద్ సిరాజ్‌ కూడా వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, సుందర్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్ తమ స్థానాలను నిలబెట్టుకోగా.. గాయం నుంచి కోలుకున్న టీ నటరాజన్‌తో పాటు శుభ్‌మన్ గిల్, కృనాల్ పాండ్యా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. సెకండ్ టీ20లో అదరగొట్టిన ఇషాన్ కిషన్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. మార్చి 23 నుంచి ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుండగా.. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇక జట్టు వివరాలు చూస్తే సెలక్ట్‌ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్(కీపర్), కేఎల్ రాహుల్(కీపర్), యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్.