Financial planning tips: ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ పని సాగాలన్న డబ్బు కచ్చితంగా అవసరం. కొందరు డబ్బు జీవితం కాదని.. డబ్బు లేకపోయినా హాయిగా బతకవచ్చని చెబుతూ ఉంటారు. కానీ ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లాలన్న.. ఇంట్లో ఉదయం టిఫిన్ చేయాలన్న డబ్బుతోనే పని ఉంటుంది. అయితే ఎంతవరకు డబ్బు సంపాదించాలి? సాధారణంగా మానవుల జీవితానికి ఎంత డబ్బు అవసరం ఉంటుంది? అనేది చెప్పడం కష్టం. ఎంతో కొంత డబ్బు లేకపోతే మాత్రం జీవితం మనుగడ కష్టం. అయితే డబ్బు ఎంత అవసరం అనేది అలెగ్జాండర్ చెప్పిన సూత్రం ఏంటో తెలుసా?
మానవ జీవితాన్ని నడిపించేది డబ్బే. పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చేయకపోతే కడుపునిండే అవకాశం లేదు. అయితే అందరూ ఒకే రకంగా డబ్బు సంపాదించలేరు. కొందరు ఎక్కువగా సంపాదిస్తారు. మరికొందరు తక్కువగా సంపాదిస్తారు. ఎక్కువగా సంపాదించే వారిని కీర్తిస్తూ తక్కువ సంపాదించేవారు బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఎందుకు ఎక్కువ సంపాదించొద్దు? అన్న ఆలోచన చేయరు. అయితే ఇదే సమయంలో కొందరు అతిగా డబ్బు అవసరం లేదని.. డబ్బు లేకపోయినా జీవితం బాగుంటుందని అంటారు. వాస్తవానికి డబ్బు లేకపోతే విలువ కూడా ఉండదని మరికొందరు చెబుతారు. ఆ విలువ ఎలా ఉంటుందంటే?
అలెగ్జాండర్ గురించి అందరికి తెలిసిన విషయమే. గొప్ప చక్రవర్తిగా పేరు సంపాదించిన ఆయన మరణించే సమయంలో తన చేతులను బయటపెట్టి నేను చనిపోయేటప్పుడు ఏమి తీసుకుపోవడం లేదని అంటారు. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు చనిపోయేటప్పుడు ఎవరు ఏమి తీసుకుపోరని.. అందువల్ల డబ్బు సంపాదించడమే ధ్యేయం కాదని అంటారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇదే విషయాన్ని ఒక బిచ్చగాడు చెబితే ఎవరైనా పట్టించుకుంటారా? అంటే ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని డబ్బు ఉన్న అలెగ్జాండర్ చెబితే మాత్రం ఇప్పటికీ మనం చర్చించుకుంటున్నాం. అందుకు కారణం అలెగ్జాండర్ దగ్గర డబ్బు ఉంటేనే కదా అని కొందరు చెబుతున్నారు.
అలాగే ఒక మనిషికి విలువ రావాలంటే కూడా డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించకపోతే జీవితం గడవకపోవడమే కాకుండా.. సమాజంలో గుర్తింపు కూడా రాదు. దీంతో ఏ పని చేయాలన్నా తోచదు. ఫలితంగా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే డబ్బు కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం.. తప్పుడు పనులు చేయడం మాత్రం చేయవద్దు. అలా చేయడంవల్ల ఎప్పటికైనా మళ్ళీ జీరో స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. కష్టపడి లేదా తెలివితో డబ్బు సంపాదించడం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ గొప్ప వాళ్లంతా ఎదగాలన్న ఆశతో కాదు.. సాధ్యమైనంతవరకు కష్టపడి డబ్బు సంపాదించినందుకు ప్రయత్నించాలి. అప్పుడే సమాజంలో గౌరవం ఉంటుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఇతరులతో కమ్యూనికేషన్ బాగుంటుంది.